• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య అభిమానుల్లో దడ

బాలయ్య అభిమానుల్లో దడ

By - Tupaki Desk
Update: 2017-04-01 06:12 GMT
గత కొన్నేళ్లలో ఒక్క ‘టెంపర్’ను మినహాయిస్తే పూరి జగన్నాథ్ నుంచి యావరేజ్ మూవీలు కూడా రాలేదు. దానికి ముందు వెనుక డిజాస్టర్లే తీశాడు పూరి. ‘టెంపర్’ స్క్రిప్టు కూడా ఆయనది కాదన్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలు చూశాక పూరి వీరాభిమానుల్లో కూడా ఆయన మీద నమ్మకం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ పూరితో జట్టు కట్టాలనుకోవడం చూసి ఆయన అభిమానుల్లో కంగారు మొదలైంది. ఐతే ఇది జస్ట్ రూమరే అనుకుంటుంటే.. హడావుడిగా సినిమా మొదలుపెట్టేసి షాకిచ్చాడు బాలయ్య.

తొలి షెడ్యూల్ అయిందని.. యాక్షన్ సీక్వెన్స్ భలే వచ్చిందని.. బాలయ్య ఎనర్జీ అదుర్స్ అని.. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో బాలయ్యను అలా చూపిస్తానని పూరి అంటుంటే కాస్త ఊరట చెందారు. కానీ ఇందులో నందమూరి అభిమానుల ఆశలపై ‘రోగ్’ పిడుగు పడింది. చాలా తక్కువ అంచనాలతో చూస్తున్నా నిరాశ పరుస్తున్న చిత్రమిది. పూరిలో క్రియేటివిటీ అంతా అడుగంటిపోయినట్లుగా అనిపించింది సినిమా చూస్తుంటే. ఇలాంటి సినిమా తర్వాత పూరి బాలయ్యతో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో దడ పుడుతోంది. ‘రోగ్’ అనుకోకుండా అలా తీసేశాడేమోలే అనుకోవడానికి కూడా లేదు. దానికి ముందు కూడా పూరి నుంచి పేలవమైన సినిమాలే వచ్చాయి. ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీకే చెందిన కళ్యాణ్ రామ్ కు ‘ఇజం’తో షాకిచ్చాడు పూరి. మరి బాలయ్యతో ఆయన చేస్తున్న సినిమా ఎలా వస్తుందో ఏమో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Balakrishna Fans 
  • Rogue movie 
  • Puri Jagannath 
  • Telugu News 

Similar News

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS