క్రాక్‌ అన్‌ స్టాపబుల్‌ స్ట్రీమింగ్‌ టైమ్ అప్డేట్‌

Update: 2021-12-30 13:30 GMT
బాలకృష్ణ ఆహా టాక్ షో అన్‌ స్టాపబుల్‌ వరుసగా స్టార్స్ తో కళ కళలాడుతోంది. గత వారం అల్లు అర్జున్‌ పుష్ప టీమ్‌ తో సందడి చేయగా ఈ వారం కొత్త సంవత్సరం సందర్బంగా మాస్ రాజా రవితేజతో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. డిసెంబర్ 31వ తారీకు రవితేజ స్పెషల్‌ అన్‌ స్టాపబుల్‌ షో అంటూ ప్రకటించారు కాని టైమ్‌ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆహా టీమ్‌ రవితేజ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ పై స్పష్టత ఇచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో స్ట్రీమింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య మరియు రవితేజల మద్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అవన్నీ కూడా కేవలం పుట్టుకు వచ్చిన పుకార్లే అని ఈ షో తో ఇద్దరు హీరోలు కూడా క్లీయర్‌ చేయబోతున్నారు.

బాక్సాఫీస్ వద్ద పలు సార్లు రవితేజ మరియు బాలకృష్ణ తమ తమ సినిమాలతో పోటీ పడ్డారు. కనుక ఇద్దరి మద్య విభేదాలు అంటూ కొందరు పుట్టించే ప్రయత్నం చేశారు తప్ప ఇద్దరి మద్య ఎలాంటి వివాదం లేదని దీంతో క్లారిటీ రాబోతున్నందుకు ఇండస్ట్రీ వర్గాల వారు ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్‌ కు అత్యధిక రన్ టైమ్‌ దక్కడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌ మోస్ట్‌ వెయిటెడ్‌ ఎపిసోడ్‌ గా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్‌ బాబుతో కూడా అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగింది. కాని సంక్రాంతి వరకు ఆ ఎపిసోడ్‌ ను హోల్డ్‌ లో ఉంచేలా ఉన్నారు.

కొత్త సంవత్సరం కానుకగా రాబోతున్న బాలయ్య.. రవితేజ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ లో దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా కనిపించబోతున్నాడు. గోపీచంద్‌ మలినేని మరియు రవితేజలది హిట్‌ కాంబో.. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరి కాంబోలో క్రాక్ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ తో గోపీచంద్‌ మలినేని సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు కూడా ఈ షో ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఆహా లో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో కు అత్యధిక రన్ టైమ్‌ దక్కింది. కనుక మరిన్ని ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్స్ రాబోతున్నాయి అంటూ ఆహా టీమ్‌ నమ్మకంగా చెబుతున్నారు.
Tags:    

Similar News