సింగిల్ ఫ్రేమ్ లో నంద‌మూరి త్ర‌యం

Update: 2019-12-31 13:37 GMT
నంద‌మూరి హీరోలంతా ఒకే వేదిక‌పై క‌నిపిస్తే ఫ్యాన్స్ కి ఎంత క‌న్నుల‌పండుగ‌గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నేలేదు. బాబాయ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటుగా అన్న‌ద‌మ్ములు క‌ళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఒకే వేదిక‌పై క‌నిపించే సంద‌ర్భం చాలా అరుదు. ఇంత‌కుముందు ఎన్టీఆర్ బ‌యోపిక్ వేదిక‌పై క‌నిపించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి స‌న్నివేశం రిపీట్ కాలేదు.

అయితే ఎట్ట‌కేల‌కు క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి అలాంటి అరుదైన అవ‌కాశం ఫ్యాన్స్ కోసం క‌ల్పించ‌నున్నారు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `ఎంత మంచివాడవురా` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న  రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేదిక‌పై స‌ర్ ప్రైజింగ్ గెస్ట్స్ ఉంటార‌ట. బాబాయ్ బాల‌కృష్ణ‌.. త‌మ్ముడు ఎన్టీఆర్ ఇద్ద‌రికీ ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్ ఆహ్వానాలు పంపారు. జనవరి 8న హైదరాబాద్ లో జరగ‌నున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ ఇద్ద‌రూ త‌న‌తో పాటు ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌నున్నారు.

ఒక వేదిక‌పై అలాంటి అరుదైన దృశ్యం క‌నిపించనున్నారన్న వార్త‌ నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. జ‌న‌వ‌రి 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా- సుభాశ్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు.


Tags:    

Similar News