బాక్సాఫీస్ వార్ : బాల‌య్య వ‌ర్సెస్ చిరు

Update: 2022-12-22 11:30 GMT
సంక్రాంతి స‌మ‌రం మ‌రి కొన్ని రోజుల్లో మొద‌లు కాబోతోంది. 2023 జ‌న‌వ‌రి సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాల‌తో పాటు ఓ చిన్న సినిమా కూడా బ‌రిలోకి దిగుతోంది. ఈ సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటా పోటీగా పోటీప‌డుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌'తో పోటీకి దిగుతుండ‌గా, నంద‌మూరి బాల‌కృష్ణ 'వీర‌సింహారెడ్డి' మూవీతో పోటీకి సై అంటున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌రువాత ఈ ఇద్ద‌రు హీరోలు సంక్రాంతి బ‌రిలో పోటీకి దిగుతుండ‌టంతో సంక్రాంతి ఫైట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదే టైమ్ లో విజ‌య్ న‌టిస్తున్న 'వార‌సుడు' రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిప‌ల్లి నిర్మిస్తున్న ఈ మూవీ జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీతో పాటు మ‌రో త‌మిళ డ‌బ్బింగ్ మూవీ 'తెగింపు' కూడా రాబోతోంది. అజిత్ హీరోగా హెచ్ వినోద్ డైరెక్ష‌న్ లో 'తునీవు' పేరుతో బోనీ క‌పూర్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో 'తెగింపు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా జ‌న‌వ‌రి 12నే విడుద‌ల కాబోతోంది.

ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ న‌టిస్తున్న 'క‌ల్యాణం క‌మ‌నీయం' కూడా రాబోతోంది. స‌రిగ్గా ఈ మూవీని సంక్రాంతి రోజే అంటే జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ న‌టిస్తున్న సినిమాలు 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' సినిమాల మ‌ధ్య వుంది. ఈ రెండు సినిమాల‌కు రెండు విష‌యాల్లో ద‌గ్గ‌రి సంబంధం వుంది.

ఈ రెండు సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ గా శృతిహాస‌న్ ఈ రెండు సినిమాల్లోనూ న‌టిస్తోంది. 'క్రాక్‌' మూవీతో ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని 'వీర సింహారెడ్డి'ని తెర‌కెక్కిస్తున్నాడు.

అంతే కాకుండా ఈ మూవీలో బాల‌కృష్ణ 'అఖండ‌' త‌రువాత మ‌రోసారి డ్యుయెల్ రోల్ లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో కనిపించ‌బోతున్నాడు. 'అఖండ‌'ని త‌న సంగీతంతో ఓ మెట్టు పైకి లేపిన త‌మ‌న్ ఈ మూవీకి కూడా అదే స్థాయి సంగీతం అందించాడు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇవి వీర సింహారెడ్డి బాలాలు.

ఇక చిరు న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌'లో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, చిరు 'ముఠామేస్త్రీ త‌ర‌హా మేకోవ‌ర్ లో వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు మ‌రో ప్ర‌ధాన బ‌లం ఎవ‌రంటే మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ఈ మూవీలో ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో 44 నిమిషాల నిడివితో సాగే క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌బోతుండ‌టం ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌బోతోంది. 'పుష్ప‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. బాబి ద‌ర్శ‌కుడు. భారీ సినిమాల‌కు డీల్ చేయ‌లేడ‌నే అప‌వాదుని ఈ మూవీతో ఎలాగైనా అధిగ‌మించాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో బాబీ ఈ మూవీ చేశాడు. దీంతో దీంతో చిరు, బాల‌య్య ల నుంచి త‌మ‌న్ , దేవీల వ‌ర‌కు ఈ సినిమాలు గ‌ట్టి స‌వాల్ గా మారాయి.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News