బాలయ్యతో సినిమానా మజాకా

Update: 2017-03-09 06:25 GMT
నందమూరి బాలకృష్ణ అంటే నిర్మాతల్లో ఒక రకమైన ఆరాధ్యభావం కనిపిస్తుంది. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు తహతహలాడిపోతున్నారు. బాలయ్యతో పని చేసే అవకాశం రాగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు. ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద్ ప్రసాద్ కూడా ప్రస్తుతం అలాంటి ఎగ్జైట్మెంట్లోనే ఉన్నట్లున్నారు.

బాలయ్య-పూరి కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త సినిమాకు ఆనంద్ ప్రసాదే నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలయ్య కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేయించారాయన. సినిమా రిలీజైనపుడు థియేటర్ల ముందు పెట్టినట్లుగా భారీ కటౌట్ పెట్టించారు. తెలుగు చరిత్రకు తిలకం దిద్దిన మా హీరో నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం అంటూ.. ఈ కటౌట్ ఏర్పాటు చేసింది భవ్య క్రియేషన్స్.

బాలయ్య 101వ సినిమాను పూరి అనౌన్స్ చేశాక కూడా కొంత మంది ఈ ప్రాజెక్టు విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ఐతే ఈ కటౌట్ చూశాక ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. గుడిలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి బోయపాటి శ్రీను.. క్రిష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు.. అభిమానులతో ఆ ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News