`బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్` స్క్రాప్ లో వేశారా?

Update: 2020-12-22 11:51 GMT
2018లో నెట్ ‌ఫ్లిక్స్ `బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్` అనే వెబ్ సిరీస్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. ఆనంద్ నీలకంఠ‌న్ పుస్తకం `ది రైజ్ ఆఫ్ శివగామి` ఆధారంగా రూపొందిస్తున్న సిరీస్ ఇది. శివగామి ప్రయాణంపై సిరీస్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరిగింది. ఆర్కా మీడియా వర్క్స్ - ఎస్.ఎస్ రాజమౌళి సహా బాహుబలి బృందంతో నెట్ ‌ఫ్లిక్స్ భాగస్వామ్య ఒప్పందంలో ఇది తెర‌కెక్కుతోంది. దేవా కట్టా- ప్రవీణ్ సత్తారు కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించాల్సి ఉండ‌గా ఈ ప్రాజెక్ట్ అకార‌ణంగా ర‌ద్ద‌యింది. ఈ సిరీస్ ని సరికొత్త టెక్నిక‌ల్ బృందం తారాగణంతో తిరిగి ప్రారంభిస్తార‌న్న‌ది తాజా అప్ డేట్.

ఓ ప్ర‌ముఖ టాబ్లాయిడ్ క‌థ‌నం ప్రకారం.. ఈ సిరీస్ ఫైన‌ల్ వ‌ర్క్ తగినంతగా ఆకర్షించకపోవడంతో సిరీస్ ను రద్దు చేశార‌ని తెలిసింది. ఈ సిరీస్‌ను తిరిగి స‌రికొత్త‌గా ఇమాజినేట్ చేసేందుకు రీక్రియేట్ చేసేందుకు స‌రికొత్త సృజనాత్మక బృందాన్ని ఎంపిక చేశారని తెలిసింది. కొత్త టీమ్ సృజనాత్మక విధానంతో తిరిగి ప‌ని మొద‌లెట్టార‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. విశ్వేశ్ కృష్ణమూర్తి అనే ప్ర‌తిభావంతుడు ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఎఆర్ రెహమాన్ 99 సాంగ్స్ కి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్.ఎస్.రాజమౌళి పర్యవేక్ష‌ణ‌లో కృష్ణమూర్తి ప‌ని చేస్తార‌ట‌. ప్రస్తుతానికి తారాగణం ఎంపిక సాగుతోంది.

బాహుబలి భారతదేశంలో అత్యంత ప్రియమైన కథలలో ఒకటి. ఈ విశ్వానికి తగినట్లుగా తగిన రీతిలో పాత్ర‌ల‌తో ప్రాణం పోసుకోవడానికి మేము మా భాగస్వాములతో పాటు కథను పునఃప‌రిశీలిస్తున్నాము. పూర్తి స్థాయిలో అంద‌రికీ న‌చ్చేలా న్యాయం చేస్తామా లేదా అన్న‌ది ముఖ్యం. కథ చెప్పే డెప్త్.. సంక్లిష్టమైన పాత్రలతో ప్ర‌యోగం ఇది అ‌ని నెట్ ‌ఫ్లిక్స్ ఇండియా బృందం పేర్కొంది.

రెండు సీజన్లుగా ఈ సిరీస్ తెర‌కెక్కిస్తారు. సిరీస్ ‌లో మొదటి సీజన్ తొమ్మిది ఎపిసోడ్ ‌లను కలిగి ఉంటుంది. ప్రీక్వెల్ క‌థ‌లో తిరుగుబాటు ప్రతీకారంతో ర‌గిలిపోయే తెలివైన అసమాన ప్ర‌తిభావని అయిన రాణి శివగామి ప్రయాణానికి సంబంధించిన క‌థాంశమిది. అధికారం రాజకీయాలు కుట్రలు మహీష్మతి ఎదుగుదలకు వ్యతిరేకంగా - నగర-రాష్ట్రం నుండి సామ్రాజ్యం వరకు తిరుగుబాటు క‌థ‌లు ఉన్నాయి. బాహుబలి ఫ్రాంచైజీని ఏర్పాటు చేసిన గొప్ప నేపథ్యం తాలూకా డ్రామా ఇది. భారీ ఖ‌ర్చుతో అద్భుతమైన విజువల్స్ ఇవ్వాల్సి ఉంది. కనెక్టివ్-ఎపిక్ స్టోరీ-టెల్లింగ్ తో సహా - ఫ్రాంచైజ్ అద్భుతమైన కథన శైలిని తెర‌పైకి తేవాల‌న్న సంక‌ల్పంతో ఈ సిరీస్ రూపొందిస్తామ‌ని నెట్ ఫ్లిక్స్ బృందం అప్ప‌ట్లోనే వెల్ల‌డించింది.

ఈ ధారావాహిక ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్‌లో ఉంది మరియు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి నేలమీదకు రావాలని మేకర్స్ యోచిస్తున్నారు.ఇంతకుముందు 2019 లో సిరీస్ కి ఎంపిక చేసిన‌ప్పుడు మృణాల్ ఠాకూర్- అనూప్ సోని - రాహుల్ బోస్ ఉన్నారు. వీరు రిపీట‌వుతున్నారా లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News