• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్యాక్ టు బ్యాక్...

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. ఆదిని గుర్తు చేస్తున్న సంతోష్‌ శోభన్‌

By - Tupaki Desk
Update: 2022-04-12 06:32 GMT
సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన ఆది సాయికుమార్‌ హీరోగా సక్సెస్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్‌ లో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన ఆది సక్సెస్ రేటు మాత్రం దారుణంగా ఉంది. సాధారణంగా అయితే రెండు మూడు సినిమాలు ప్లాప్ అయితే ఆఫర్లు దక్కడం గగనంగా మారుతుంది. కాని ఆది సాయి కుమార్‌ మాత్రం అనూహ్యంగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

అదృష్టం కొద్ది వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఆది సాయికుమార్‌ హీరోగా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూ కెరీర్‌ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు చూస్తుంటే ఒక్కోసారి ముచ్చటేస్తుంది. హీరోగా ఆయన ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా సక్సెస్ అవుతాడేమో అనే నమ్మకంతో సాయి కుమార్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆది సాయి కుమార్‌ తయారు అయ్యాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఆది సాయి కుమార్ ఎలా అయితే సక్సెస్ లు లేకున్నా కూడా తండ్రి బ్యాక్ గ్రౌండ్‌ మరియు అదృష్టం కొద్ది ఎలా అయితే సినిమా లను దక్కించుకుంటున్నాడో అలాగే దివంగత దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ కూడా ఆఫర్లు దక్కించుకుంటూ ఉన్నాడు. ప్రభాస్ తో పాటు మహేష్ బాబు తో సినిమాలను తెరకెక్కించి మంచి పేరు దక్కించుకున్న శోభన్ తనయుడు అవ్వడం వల్ల సంతోష్‌ శోభన్ కు మంచి గుర్తింపు దక్కింది.

కెరీర్‌ ఆరంభంలో టాలీవుడ్‌ స్టార్స్ ఈయనకు మద్దతుగా నిలవడం వల్ల మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే సినిమాలు ఈయన చేసినవి బాక్సాఫీస్ వద్ద హడావుడి చేయక పోవడంతో పాటు కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్ లు గా నిలవడం లేదు. అయినా కూడా ఆఫర్ల విషయం లో మాత్రం సంతోష్‌ కు ఏమాత్రం తగ్గడం లేదు అంటూ స్వయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంతోష్‌ శోభన్‌ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. కాని కమర్షియల్‌ సక్సెస్ లు మాత్రం దక్కించుకోలేక పోతున్నారు. సినిమాకు సంబంధించిన విషయాల పట్ల ఆయన నిర్ణయాలు కొన్ని గతి తప్పుతున్నాయి.

అయినా కూడా ఆఫర్ల విషయంలో మాత్రం ఆయన తగ్గేది లేదు అన్నట్లుగా వరుస గా ఆఫర్లతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం సినిమా లు చాలానే చేస్తున్న సంతోష్ కు అందులో ఒకటి రెండు అయినా కమర్షియల్‌ సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.
Tags:    
  • SantoshShoban 
  • SaiKumar 
  • TeluguMovies 
  • Adi 
  • DirectorShobhan? 
  • Prabhas 
  • MaheshBabu 
  • Tollywood 
  • WebSeries 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS