ఫాస్టెస్ట్ 100.. బాలీవుడ్ షాక్ అంతే
బాహుబలి దెబ్బకు ఇండియా సినిమా రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ఈ సినిమా రికార్డుల్నిచూసి బాలీవుడ్ సూపర్ స్టార్ లుగా పిలువబడే ఖాన్ త్రయం ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ లో ఖాన్ త్రయంలో నుంచి ఎవరి సినిమా వచ్చిన సరే మొదటి నాలుగు, ఐదు రోజులలో 100 కోట్ల క్లబ్ లలో ఈజీగా చేరుతుంటాయి. అలాంటి వారికే సాధ్యం కాని రికార్డును బాహుబలి నెలకొల్పింది.
షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ మూవీ హ్యాపీ న్యూయర్ ఓపెనింగ్స్ అదరగొట్టిన, వంద కోట్ల క్లబ్ లో చేరడానికి ఐదు రోజుల సమయం పట్టింది. అలాగే బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ చెప్పబడుతున్న అమీర్ ఖాన్ పీకే కూడా వంద కోట్ల క్లబ్ లో చేరడానికి నాలుగు రోజుల సమయం తీసుకుంది. కానీ బాహుబలి మాత్రం వీరి రికార్డులను చెదరగొడుతూ కేవలం రెండే రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో దూరిపోయింది.
మూడు రోజులకు 160కోట్లా గ్రాస్స్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, వీకెండ్ అయిపోయిన తరువాత కుడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రికార్డుల వేటలో ముందుకు దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఇంకేన్ని రికార్డులకు ఎసరు పెడుతుందో, ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.