ప్రభాస్ ప్రభంజనం అక్కడా మొదలైంది

Update: 2016-05-13 08:23 GMT
బాహుబలి విడుదలై 10 నెలలు దాటిపోయింది. అయినా దాని క్రేజ్ ఇంకా తగ్గలేదు. నెలకో దేశంలో రిలీజవుతూ.. ప్రతిచోటా సంచలనాలు సృష్టిస్తోందీ సినిమా. తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాటు తైవాన్ దీవిలో సైతం ‘బాహుబలి’ని విడుదల చేస్తుండటం విశేషం. తూర్పు చైనాకు 180 కిలో మీటర్ల దూరంలోని తైవాన్ దీవిలో శుక్రవారమే ‘బాహుబలి’ థియేటర్లలోకి దిగింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఓ చిన్న ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. హీరో ప్రభాస్ తైవాన్ ప్రేక్షకులకు బాహుబలి గురించి చెబుతూ.. ఈ సినిమాను మిస్ కావద్దంటూ పిలుపునిచ్చాడు.

తైవాన్ పర్వాతోరహణకు ఫేమస్. చిన్నచిన్నపట్టణాలతో అందమైన రిసార్ట్స్ పర్వాతోరహణకు అనుకూలంగా ఉన్న పర్వతాలతో.. పండ్ల తోటలు.. మార్కెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ‘బాహుబలి’లో హీరో కూడా కొండలెక్కడంలో బిజీగా ఉంటాడు కాబట్టి.. అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్టవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో.. చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది ‘బాహుబలి’. ఒక్క జర్మనీలో మాత్రమే ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. చైనాలో ఈ సినిమాను 4 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. చూస్తుంటే ‘బాహుబలి-2’ విడుదలయ్యే వరకు ‘బాహుబలి-1’ ఎక్కడో ఓ చోట రిలీజవుతూనే ఉండేలా ఉంది.
Tags:    

Similar News