బాహుబలికి ఏడాది.. మేకింగ్ వీడియో కేక
సరిగ్గా సంవత్సరం క్రితం.. ఇదో రోజున టాలీవుడ్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న ఏ అంచనా తప్పకుండా.. ఓ తెలుగు సినిమా అయిన బాహుబలి అద్భుతాలను సాక్షాత్కరించింది. ఓ తెలుగు సినిమాతో ఇలాంటి అసామాన్య విజయాన్ని సాధించచ్చని.. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.
2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ విడుదలై.. ఎన్నెన్నో విజయాలను సాధించింది. దశాబ్దాల పాటు థియేటర్ల మొహం చూడని వాళ్లను కూడా.. సినిమా థియేటర్ వైపు నడిపించింది. ఈ సందర్భంగా.. బాహుబలి ది బిగినింగ్ కి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను బాహుబలి యూనిట్ విడుద చేసింది. ఇందులో హీరో ప్రభాస్ నుంచి.. విలన్ రానా.. హీరోయిన్స్ అనుష్క.. తమన్నాలతోపాటు కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ పడ్డ కష్టం కూడా కనిపిస్తుంది. నిమిషం పైగా నిడివి ఉన్న ఈ వీడియోని చూసిన తర్వాత.. ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు.
బాహుబలి ది బిగినింగ్ మూవీలో తాము చూసిన ప్రతీ సన్నివేశం గ్రాఫిక్ మాయాజాలమే అనే విషయం ప్రేక్షకులకు అర్ధమవుతుంది. అంతగా తన ఊహలను విజువలైజ్ చేసి ఆడియన్స్ కి పిచ్చిక్కించిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. టాలీవుడ్ స్థాయిని ఖ్యాతిని దిగంతాలకు తీసుకెళ్లడంలో బాహుబలి పాత్ర ఎంతగా ఉందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మరో రెండు వారాల్లో చైనాలో ఈ సినిమా సత్తా చాటనుంది.
Full View