అత్తారింటికి దారేది కన్నా డబులా?

Update: 2015-07-11 09:05 GMT
ఇకపై ఏ తెలుగు సినిమా కూడా కలెక్షన్ల విషయంలో రికార్డుల గురించి కలలోనూ తలిచే అవకాశం లేనట్లే. బహుశా రాజమౌళికి కూడా తన రికార్డులు బద్దలు కొట్టడం సాధ్యం కాదేమో. బాహుబలి సృష్టిస్తున్న రికార్డులు అలా ఉన్నాయి మరి. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కంటే క్రేజీ కాంబినేషన్‌ ఏముంటుంది? వీళ్లిద్దరి కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో మొదలైన 'అత్తారింటికి దారేది' తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.10.75 కోట్లతో రెండేళ్ల కిందట సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు రికార్డు కంటే బాహుబలి రెట్టింపు వసూళ్లు సాధించడం విశేషం. 'బాహుబలి' తొలి రోజు కేవలం డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ మాత్రమే రూ.24 కోట్ల దాకా వచ్చినట్లు చెబుతున్నారు.

అసలు బాహుబలి కలెక్షన్లను సరిగా లెక్కగట్టడానికి కూడా కష్టమవుతోంది. రెండు రాష్ట్రాల్లో 95 శాతం కంటే ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడుతోంది.  ముందుగా షెడ్యూల్‌ కాని థియేటర్లలో కూడా అప్పటి క్రేజ్‌ చూసి బాహుబలి వేసేశారు. దీంతో పూర్తి లెక్కలు రావడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశముంది. ఇక రెండు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూస్తే ఎక్కడికక్కడ కళ్లు చెదిరే రికార్డులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో తొలి రోజే 2.53 కోట్ల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ వచ్చింది. తొలి రోజు వసూళ్లలో ఇప్పటిదాకా ఆ జిల్లాలో ఉన్న రికార్డు కంటే కోటి రూపాయల కంటే ఎక్కువ వసూలవడం విశేషం. కృష్ణా జిల్లాలో రూ.1.24 కోట్లు వచ్చాయి. అక్కడ కూడా మార్జిన్‌ రూ.50 లక్షలకు పైనే ఉంది. నెల్లూరు లాంటి చిన్న సెంటర్లో కూడా బాహుబలి తొలి రోజు రూ.93 లక్షలు వసూలు చేసింది. గత రికార్డు అందులో సగం మాత్రమే. ఇలా ఎక్కడికక్కడ మోత మోగించేస్తోంది బాహుబలి.

Tags:    

Similar News