కేరళలో బన్నీ రికార్డు ‘బలి’

Update: 2015-07-14 14:11 GMT
బాహుబలి బౌండరీలేమీ పెట్టుకోవట్లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మల్లూవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగులో హైయెస్ట్ గ్రాసర్ రికార్డును నాలుగు రోజులకే దాటేసిన బాహుబలి.. హిందీలో, తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన అనువాద చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడిక మల్లూవుడ్ రికార్డుల మీదా బాహుబలి కన్ను పడింది.

కేరళలో అల్లు అర్జున్‌కు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అక్కడి అతడి ప్రతి సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది. గత ఏడాది ‘రేసుగుర్రం’.. లక్కీ ది రేసర్ పేరుతో విడుదలై అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా ఫుల్ రన్‌లో రూ.2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఓ తెలుగు అనువాదం ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం రికార్డే. ఐతే ఆ రికార్డును బాహుబలి దాటేసింది.

ఇప్పటికే ఆ సినిమా అక్కడ రూ.2.65 కోట్ల షేర్ రాబట్టినట్లు అంచనా. నిజానికి ఈ రికార్డు ఓ రోజు ముందే రావాల్సింది. తొలి రోజు కేరళలో డిస్ట్రిబ్యూటర్ల సమ్మె కారణంగా ఓ 50 థియేటర్లలో మాత్రమే రిలీజైంది బాహుబలి. ఐతే రెండో రోజు నుంచి థియేటర్లు పెరిగి.. ప్రస్తుతం దాదాపు 300 థియేటర్లలో ఆడుతోంది. ఫుల్ రన్‌లో ఈ సినిమా ఓ ఐదు కోట్ల దాకా కలెక్ట్ చేసినా చేయొచ్చు. ఓ తెలుగు సినిమాకు కేరళలో ఈ స్థాయి కలెక్షన్లు రావడమంటే మాటలు కాదు. మళ్లీ బాహుబలి-2 వచ్చాకే ఆ రికార్డు బద్దలవుతుందేమో.
Tags:    

Similar News