బాహుబలి వెంటే భారీ ప్రకటనలు

Update: 2017-05-27 09:46 GMT
భారతీయ సినీ పరిశ్రమకు ఒక్కసారిగా ఫ్యాంటసీపై మక్కువ పెరిగిపోయింది. బాహుబలి సాధించిన ఘనవిజయం తర్వాత.. సరైన కంటెంట్ ఉంటే దేశవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చని గట్టి నమ్మకానికి వచ్చేశారు మేకర్స్. అందుకే ఫ్యాంటసీ జోనర్ లో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించేందుకు ప్రకటనలు తెగ వచ్చేస్తున్నాయి.

సుందర్ సి. దర్శకత్వంలో భారీ బడ్జెట్ సంఘమిత్ర అనే ఫ్యాంటసీ మూవీ తీస్తామంటూ బాహుబలి2 రిలీజ్ కు కొన్ని నెలల ముందే ప్రకటన వచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ సక్సెస్ స్థాయి చూసిన వెంటనే.. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మహాభారతం పై అనౌన్స్ మెంట్ చేశారు. తాజాగా రాయామణ మహాకావ్యాన్ని నిర్మిస్తామని నిర్మాతలు మధు మంతెన.. అల్లు అరవింద్.. నమిత్ మల్హోత్రాలు ప్రకటించారు. మహాభారతం బడ్జెట్ వెయ్యి కోట్లు అయితే.. రామాయణం బడ్జెట్ 500 కోట్లు. ఇవన్నీ ఒకేసారి పలు భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్నవే.

బాహుబలి చేసిన మ్యాజిక్ ఇవన్నీ రిపీట్ చేస్తాయని చెప్పలేం కానీ.. ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సంఘమిత్ర సంగతి చెప్పలేదు కానీ.. మిగిలిన సినిమాలు మాత్రం సిరీస్ గా వచ్చేవే. మరి మొదటి భాగం రిజల్ట్ తేడా వస్తే.. తర్వాతేం చేస్తారనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేం. కానీ బాహుబలి మాత్రం దేశంలో ఫ్యాంటసీ సినిమాల ఫీవర్ ను పెంచేసిందని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News