బాహుబలి2లో ఆస్కార్ సినిమా సీన్లు??

Update: 2016-03-03 22:30 GMT
బాహుబలి: ది బిగినింగ్.. రాజమౌళి తీసిన ఈ చిత్రరాజం ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. అయితే.. భారీ యుద్ధ సన్నివేశాలు, హై లెవెల్ యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నా.. అందులో భల్లాలదేవుడి కొడుకుని చంపే సీన్ తప్ప వేరే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా కట్టిపడేసే రేంజ్ లో లేదు. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ స్టైల్ లో ఉండే యాక్షన్ పార్ట్ కూడా బాహుబలి మొదటి భాగంలో లేదు. ఈ లోటు బాహుబలి: ది కంక్లూజన్ లో ఉండకూడదని అనుకుంటున్నారట జక్కన అండ్ కో. అందుకే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందించిన చిత్రం ది రెవెనెంట్. ఈ మూవీ ఉత్తమ చిత్రం కేటగిరీల్లో ఆస్కార్ దక్కించుకుంది. ఇప్పుడీ మూవీని బాహుబలి యూనిట్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో మంచుకొండల్లో భారీ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్, గుర్రాలతో ఛేజింగ్ సీన్స్ కూడా ఆ మూవీలో హైలైట్ గా ఉంటాయి. మరి ఇదే రేంజ్ యాక్షన్ పార్ట్ బాహుబలి2లో కనిపించేలా జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యారు రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ టీంకి స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారని చెబుతున్నారు.

బాహుబలి మొదటి భాగంలో కూడా మంచుకొండల్లో ఓ ఫైట్ ఉంటుంది.. సాధారణ తెలుగు సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోనట్లుగానే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే.. చూసేటప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా బాహుబలిలో ఒక్క సీన్ కూడా లేదన్న లోటును.. బాహుబలి2లో తీర్చేయాలని డిసైడ్ అయిపోయారు. అలా ఆస్కార్ సినిమాలో సీన్లు.. బాహుబలి2లో సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచాయన్న మాట.
Tags:    

Similar News