బీఏ రాజు కొడుక్కు ఆస్కార్‌!

Update: 2020-02-11 06:30 GMT
ఇటీవల అంగరంగ వైభవంగా సాగిన 92వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఇండియన్స్‌ కు నిరాశే మిగిలిందని అంతా ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. కాని అసలు విషయం ఏంటీ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఇండియన్స్‌ కు ఆస్కార్‌ దక్కింది. అది ఎలా అంటే 1917 అనే హాలీవుడ్‌ సినిమాకు ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరిలో ఆస్కార్‌ దక్కింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనేది ఒక్కరు చేసే పని కాదు. కొన్ని వందలు.. వేల మంది నెలల తరబడి కష్టపడి చేస్తే వచ్చేది బెస్ట్‌ ఔట్‌ పుట్‌. అందుకే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు వచ్చిన ఆ ఆస్కార్‌ అవార్డు సినిమా కోసం పని చేసిన వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టు కు దక్కుతుంది.

1917 సినిమా విఎఫ్‌ఎక్స్‌ కోసం ఇండియా నుండి చాలా మంది వర్క్‌ చేశారు. అందులో ప్రముఖ తెలుగు పీఆర్‌.. నిర్మాత.. మీడియా సంస్థ అధినేత బీఏ రాజు తనయుడు కూడా ఉన్నాడు. తన తనయుడు వర్క్‌ చేసిన సినిమాకు ఆస్కార్‌ అవార్డు దక్కడం చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్‌ మీడియా ద్వారా బిఏ రాజు షేర్‌ చేసుకున్నాడు. బీఏ రాజు తనయుడు అరుణ్‌ కుమార్‌ వీఎఫ్‌ఎక్స్‌ రంగం లో సుదీర్ఘ కాలంగా ఉంటున్నారు. ఆయన గతంలో పలు హాలీవుడ్‌ సినిమాలకు.. యానిమేటెడ్‌ సినిమాలకు కూడా వర్క్‌ చేశాడు.

గతంలో కూడా పలు వేడుకల్లో వీఎఫ్‌ఎక్స్‌ అవార్డులు దక్కించుకున్న సినిమాలకు కూడా అరుణ్‌ వర్క్‌ చేశాడట. డైరెక్ట్‌ గా కాకున్నా ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న టీంలో మన తెలుగు వాడు ఒకరు ఉండటం మనకు గర్వకారణం. అరుణ్‌ కుమార్‌ ముందు ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుందాం.
Tags:    

Similar News