బీటౌన్ హీరోయిన్ బంగ్లా.. రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Update: 2021-01-05 11:00 GMT
జాన్వీ కపూర్..’ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తొలి సక్సెస్ ను మాత్రం ఇంతవరకకూ టేస్ట్ చేయలేదు. నటనలో కూడా ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. కాగా.. సినిమాల  సంగతి పక్కనపెడితే ఈ అమ్మడు ఒక విలువైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీదేవి-బోనీకపూర్ వారసురాలిగా ‘దడఖ్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ.. ఆ సినిమాకు ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు. అంతేకాకుండా.. జాన్వీ కపూర్ నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. యాక్టింగ్ మరీ పూర్ గా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.

వెనకడుగు వేయకుండా..

తన నటనపై విమర్శలు వచ్చినా.. వెరవకుండా ముందుకు సాగిన జాన్వీ.. ‘గుంజన్ సక్సేనా’ సినిమాతో తన స్థాయిని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పనిచేసి 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ధీర వనిత గుంజన్ సక్సేనా నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లాక్ డౌన్ టైంలో.. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత జాన్వీ మంచి ఆఫర్స్ అందుకుంటోంది.

కాగా.. జాన్వీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈ 23ఏళ్ల నటి ముంబైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ఇంట్లోకి తండ్రీ, చెల్లితో కలిసి అడుగు పెట్టాలని ప్లాన్ చేసుకుంటోందట జాన్వీ.

ఆ బంగ్లా ఖరీదు రూ.39కోట్ల వరకు ఉంటుందట. ఇంటీరియర్ డిజైన్స్ కోసం మరో రూ.2 కోట్లు ఖర్చు చేస్తోందట. అయితే.. జాన్వీ తన సొంత డబ్బుతోనే ఆ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాలు, యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టుకొని, తండ్రి సపోర్ట్ తో బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న ఇల్లు కాస్త చిన్నదిగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందట జాన్వీ.
Tags:    

Similar News