పాతికకోట్ల 'శక్తి' హరించుకుపోయిందట

Update: 2017-01-02 04:53 GMT
హిట్లొస్తే మురిసి మెరిసిపోయే ఇండస్ట్రీ, ఫ్లాపులొస్తే అంతే వెలవెలబోతోంది. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు రికార్డు కలెక్షన్ల ప్రాఫిట్ ని చూపించుకునే చిత్రసీమ అంతే ధైర్యంతో ఫ్లాపుల నష్టాన్ని అంకెల్లో చూపించలేదు. అందుకే నిర్మాత స్థానం ఎప్పుడూ రిస్కీ ఎఫైరే. అలాంటి ఒక నిర్మాత ఇటీవలే తన మనసులో దాగున్న విషయాలు బయటకు పంచుకున్నాడు.

జగదేకవీరుడు అతిలోకసుందరి - ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత అశ్వినీదత్. ఒకకాలంలో టాప్ ప్రొడ్యూసర్ గా నిలిచినా దత్ గారు ఇప్పుడు సినిమాలు తీయడమే మానేశారు. 2011లో వారి సంస్థ నుండి తెరకెక్కిన శక్తి సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు సినిమాలకు దూరమయ్యారు. ఆ సినిమా అప్పట్లోనే 25కోట్ల లాస్ ని మిగిల్చిందని - చాలా నష్టపోయానని తెలిపారు.

అంతేకాదు సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాను పంపిణీచేస్తే ప్రింటింగ్ ఖర్చులు కూడా రాలేదని చెప్పారు. తన కెరీర్ లో చిరంజీవిగారితో చేసిన సినిమాలు అత్యధిక లాభాలను అందజేసినట్టు తెలిపి ముగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News