ఛాన్స్‌ ఇవ్వాలంటే ప్యాకేజీ అడుగుతున్నారా? అన‌సూయ కామెంట్!!

Update: 2021-04-04 04:46 GMT
టాలీవుడ్ లో డ్యాషింగ్ యాంక‌ర్ గా.. క‌థానాయిక‌గా.. క్యారెక్ట‌ర్ న‌టిగా అన‌సూయ పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా అల‌రించి గొప్ప ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన అన‌సూయ .. ఇంత‌కుముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది లో ఓ స్పెష‌ల్ నంబ‌ర్ లో అవ‌కాశం మిస్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ పాట‌ను కాద‌నుకున్నందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సోష‌ల్ మీడియాలో చేసిన ర‌చ్చ‌పై తాజాగా అన‌సూయ స్పందించారు. ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సంచ‌ల‌న విష‌యాల‌ను ఓపెన్ గా మాట్లాడ‌డం మ‌రోసారి చ‌ర్చ‌కు తావి‌చ్చింది. త‌న జ‌ర్నీలో చాలా విష‌యాల్ని ఈ ఆదివారం పూర్తి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌నున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ప‌లు సంచ‌ల‌నాలు వాడి వాడిగా డిబేట్ కి తెర తీశాయి. ప్రోమోలో అన‌సూయ చెప్పిన సంగ‌తులు ఇలా ఉన్నాయి.

తాను సోష‌ల్ మీడియా బాధితురాలిన‌ని చెప్పిన అన‌సూయ‌.. త‌న పొట్ట గురించి చెత్త కామెంట్లు చేశార‌ని.. ఆ కామెంట్లు చేసేవారికి ఏదీ తెలియ‌ద‌ని అన్నారు అన‌సూయ‌. నా పొట్ట అంత పెద్దగా ఉంది కాబట్టే నా కొడుకు అంత కంఫర్ట్ బుల్ ‌గా నా పొట్టలో ఉన్నాడు.. అని అన్నారు. సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తే.. `ఇదంతా నీకు అవసరమా ఆంటీ.. పిల్లల్ని చూసుకో` అని అంటారు. వాళ్లేదో నా పిల్లలకు ఫుడ్ పెడుతున్నట్టు ఫీజ్ కడుతున్నట్టు ఫీలైపోతార‌ని సెటైర్ వేశారు అన‌సూయ‌.

త‌న పాట‌ల్లో బూతు గురించి మాట్లాడేవారిపైనా అన‌సూయ పంచ్ వేశారు. 1980-90లో ఉన్న పాట‌ల్లో బూతును చూడ‌లేద‌ని ఒక‌వైపే చూస్తున్నార‌ని అన్నారు. యాంక‌ర్లు న‌టీన‌టుల ఫాల్టా ఇది? అని ప్ర‌శ్నించారు. పెళ్ల‌యి పిల్ల‌లున్న వాళ్లు ప‌నికిరార‌నే బాప‌తు ఇప్ప‌టికీ ఉన్నార‌ని కూడా అన‌సూయ వ్యాఖ్యానించారు. నిజానికి పెళ్లి కాని వారి కంటే కూడా తాను బెటర్ గా పెర్ఫామ్ చేయగలనని అన్నారు.

అత్తారింటికి దారేది లో `ఇట్స్ టైం టు పార్టీ నౌ` పాట‌లో చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం సోలో సాంగ్ కాక‌పోవ‌డ‌మే. గ్రూపులో చేయ‌మ‌ని అడిగినందుకే కాద‌న్నాన‌ని తెలిపారు. కానీ ప‌వ‌న్ కాలిగోటికి స‌రిపోవంటూ అవ‌మానించార‌ని అన‌సూయ వాపోయారు.

రంగ‌మ్మ‌త్త రోల్ త‌ర్వాత మ‌ళ్లీ త‌న స్థాయికి త‌గ్గ పాత్ర‌లు రాక‌పోవ‌డంపైనా అన‌సూయ ప్రోమోలో మాట్లాడ‌డం క‌నిపించింది. ``రావ‌ట్లేదు ఎందుకంటే.. దాంతో పాటు ప్యాకేజీలు అడుగుతున్నారు!`` అన్న వ్యాఖ్య‌తో ఏకంగా త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఇంట‌ర్వ్యూవ‌ర్ భృకుటి ముడిప‌డ‌డం విశేషం. అయితే ఆ ప్యాకేజీ ఏమిట‌న్నది నేటి పూర్తి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డి కానుంది.
Tags:    

Similar News