పోస్ట‌ర్ టాక్ః ‘అర్జున.. ఫల్గుణ..’ జీవితం మొత్తం తిర‌గ‌బ‌డిందా?

Update: 2021-02-14 11:35 GMT
యంగ్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా.. ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘అర్జున.. ఫల్గుణ’ మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసింది యూనిట్.

థీమ్ పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెంచేసింది చిత్ర బృందం. సంస్కృత అక్ష‌రాల‌తో తీర్చిదిద్దిన టైటిల్ స‌‌రికొత్త ఫీలింగ్ ను క్రియేట్ చేసింది. అందేవిధంగా.. పోస్ట‌ర్లో ఎవ‌రున్నారో క్లియ‌ర్ చూడాలంటే.. అప్ సైడ్ డౌన్ గా తిర‌గేసి చూడాల్సిందే! కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న జీవితాన్ని ఎలా త‌ల‌కిందులు చేస్తాయో చూడొచ్చ‌నే మీనింగ్ లో.. నీటి ప్ర‌తిబింబంలో వారి ముఖాల‌ను చూపించాడు ద‌ర్శ‌కుడు!

ఈ విష‌యాన్ని ధృవీక‌రించేలా.. వారిని ఓ పోలీస్ వాహ‌నం కూడా త‌రుముతుండ‌డం ఈ పోస్టర్ లో గ‌మ‌నించొచ్చు. పోలీసు వెహికిల్ ఛేజ్ చేస్తుండ‌గా.. పారిపోతోంది ఒక స్నేహితుల బృందం! మ‌రి, ఏం జ‌రిగింది? వారిని పోలీసులు ఎందుకు తరుముతున్నారు? అస‌లు వీళ్లెందుకు ప‌రిగెడుతున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.. ఈ థీమ్ పోస్ట‌ర్ చూస్తే!

ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు స‌ర‌స‌న బ్యూటీ ఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్ న‌టిస్తోంది. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా దర్శకుడు తేజ మార్ని అందిస్తుండ‌గా.. డైలాగ్స్ సుధీర్ వర్మ స‌మ‌కూరుస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.




Tags:    

Similar News