సూపర్ స్టార్ వారసుడికి జోడీగా అర్జున్ రెడ్డి బ్యూటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు మరి కూతురు ఇద్దరు కూడా సినీ రంగ ప్రవేశం కోసం ఉవ్విల్లూరుతున్నారు. మొదటగా అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ముద్దుగుమ్మ షాలిని పాండేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే జునైద్ ఖాన్ మరియు షాలిని పాండేలపై ఫొటో షూట్ చేయడం.. టెస్ట్ షూట్ కూడా నిర్వహించడం జరిగిందట. వచ్చిన ఔట్ పుట్ తో సంతృప్తి చెందిన మేకర్స్ ఇద్దరి కాంబోలో సినిమాకు సిద్దం అయ్యారు.
తెలుగులో అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న షాలిని పాండేకు ఆ సక్సెస్ కలిసి రాలేదు. తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అనూహ్యంగా అక్కడ ఈ అమ్మడు యశ్ రాజ్ ఫిల్మ్స్ లో ఒక్కసారే మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా మూడులో మరో ప్రాజెక్ట్ గా జునైద్ ఖాన్ తో సినిమా చేయబోతుంది. ఈమెకు ఈ మూడు ప్రాజెక్ట్ లతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం అంటూ నమ్మకంగా ఉన్నారు.