• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ధృవ’ హిందీ రీమేక్.. తేడా...

‘ధృవ’ హిందీ రీమేక్.. తేడా కొడుతోందే!

By - Tupaki Desk
Update: 2017-07-07 09:00 GMT
రెండేళ్ల కిందట తమిళంలో ‘తనీ ఒరువన్’ సినిమా విడుదలై వారం తిరక్కుండానే ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. ముందుగా తెలుగు నిర్మాతలు రైట్స్ పట్టేశారు. చకచకా రీమేక్ పనులు మొదలుపెట్టేశారు. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి ‘ధృవ’ పేరుతో ‘తనీ ఒరువన్’ను రీమేక్ చేశాడు. తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. తమిళంలో మాదిరే ఇక్కడా అరవింద్ స్వామి క్యారెక్టర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తప్ప మరెవరూ ఆ పాత్రకు సరిపోరు అన్న భావన తెలుగు ప్రేక్షకులకూ కలిగింది. తన కోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందనిపించేలా అందులో ఒదిగిపోయాడు అరవింద్.

ఐతే ఇప్పుడు ‘తనీ ఒరువన్’ హిందీ రీమేక్ తెరమీదికి వచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించబోతున్నాడట. అక్కడి వరకు ఎవరికీ అభ్యంతరాలు కనిపించట్లేదు. జయం రవి.. రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ని ఎవరైనా చేయొచ్చు. కానీ అరవింద్ స్వామి పాత్ర కోసం తీసుకున్న నటుడి విషయంలోనే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఈ క్యారెక్టర్ని హిందీలో అర్జున్ కపూర్ చేస్తాడట. అరవింద్ స్వామి పాత్రకు హిందీలో కూడా ఆయన్నే అడిగినట్లు వార్తలొచ్చాయి. ఐతే తెలుగులో ఆ పాత్రకు అరవింద్ ను ఒప్పించడానికే చాలా కష్టమైందట. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నించిన అరవింద్ స్వామిని ఒప్పించినట్లు తెలిసింది. హిందీ కోసం మాత్రం అతను నో అనేసినట్లు సమాచారం.

అలాంటపుడు అరవింద్ పాత్రను రీప్లేస్ చేయగలిగే సీనియర్ నటుడు ఎవరినైనా ట్రై చేయాల్సిందేమో. కానీ కుర్రాడైన అర్జున్ కపూర్ ఆ పాత్రకు ఏమాత్రం సరిపోతాడన్నది సందేహం. ‘వర్షం’ రీమేక్ ‘భాగి’ని డైరెక్ట్ చేసిన సాబిర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
Tags:    
  • Arjun Kapoor 
  • Sidharth Malhotra 
  • Sabbir Khan 
  • Thani Oruvan Remake 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS