ప్ర‌భాస్ మ‌రో షాకింగ్ స‌ర్ ప్రైజ్ కి రెడీ అవుతున్నారా?

Update: 2020-09-01 06:15 GMT
వెంట వెంట‌నే సినిమాలు ప్ర‌క‌టిస్తూ డార్లింగ్ ప్ర‌భాస్ మాంచి జోష్ మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇస్పీడ్ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్ ని ఇప్ప‌ట్లో ఆప‌డం క‌ష్ట‌మే. ఇక‌పై డార్లింగ్ న‌టించేవ‌న్నీ పాన్ ఇండియా స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టులే ఉంటాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2.. సాహో .. రాధేశ్యామ్ ఇవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలే.

ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశాన్ని ఎంచుకుని మ‌రో పాన్ ఇండియా సినిమాని ప్ర‌క‌టించారు. వైజ‌యంతి మూవీస్ ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్ల బ‌డ్జెట్ ని వెచ్చించ‌నుంది. ఆ త‌ర్వాత కూడా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్ 3డి` ఇదే స్థాయి బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియ‌న్ మూవీ.

అయితే ఇవి రెండే కాదు.. ఇప్ప‌టికే కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ వినిపించిన క‌థ‌కు ప్ర‌భాస్ ఓకే చెప్పారు. ఈ సినిమా ప్ర‌క‌ట‌న తో స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని తెలుస్తోంది. యువి క్రియేష‌న్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్సుంద‌ని స‌మాచారం.

సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ అత్యంత భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.
Tags:    

Similar News