లెజెండ్ సింగీతంతో సృజనాత్మక విభేధాలు నిజమా?
టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మకత గురించి తెలిసిందే. ఎందరో దిగ్ధర్శకులు రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న రోజుల్లో ఆయన పుష్పక విమానం- ఆదిత్య 369- భైరవద్వీపం వంటి ప్రయోగాత్మక చిత్రాలతో సంచలనాలు సృష్టించారు.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఆదిత్య 369 సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే గొప్ప ప్రయోగాత్మక చిత్రంగా మన్ననలు అందుకుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో సింగీతం ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పనివారే లేరు. ఇక ఆంగ్లంలో ఉన్నత విద్యావంతుడు అయిన సింగీతం బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందించారు. హెచ్ జి వెల్స్ రచన టైమ్ మెచీన్ నుంచి ఆయన స్ఫూర్తి పొందారని చెబుతారు.
ఇక అలాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడి నుంచి ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కుతోందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఆ సినిమా సెట్స్ కెళ్లకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఆయన ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతి మూవీస్ అశ్వనిదత్ సమర్పణలో నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్ మూవీకి పని చేస్తున్నారు అనగానే అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. ఆయన క్రియేటివిటీ అనుభవం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని సింగీతం పుట్టినరోజున చిత్రబృందం సంతోషంగా ప్రకటించింది. కానీ ఇంతలోనే రైటింగ్ టీమ్ లో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సింగీతం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా? అన్నది నాగ్ అశ్విన్ బృందాలు చెప్పాల్సి ఉంటుంది.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చేస్తామని దత్ టీమ్ కసిగా ప్రకటించింది. దాదాపు 2.0 కి పెట్టినంత బడ్జెట్ ని పెడుతున్నారని కథనాలొస్తున్నాయి. దాంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. సింగీతం వంటి వారి నిష్కృమణ అంత మంచిది కాదేమో!