ఓటీటీలు ప్లాప్ సినిమాలకు అడ్డాగా మారుతున్నాయా..?
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీల హడావిడి ఎక్కువైంది. అంతక ముందే ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా డేస్ లో బాగా పుంజుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ 'ఓవర్ ది టాప్' అనే అనిపించుకునే ప్రయత్నం చేసాయి. ఈ క్రమంలో ఓటీటీలని ఏటీటీ లనీ అనేక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయించారు. ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఫ్యామిలీతో కలిసి కంటెంట్ ని చూడటం అలవాటు చేసుకున్నారు. దీనికి తోడు చాలా రోజుల పాటు థియేటర్స్ మూతబడి ఉండటంతో కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో డిజిటల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకముందు ప్రతి శుక్రవారం కొత్త సినిమా కోసం థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుడు.. ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఓటీటీలు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేసి మరీ సినిమాలను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఇది థియేటర్ లో రిలీజ్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ కలిగించలేకపోయాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - సన్ నెక్స్ట్- జీ 5 - జీ ఫ్లిక్స్ - ఆహా వంటి ఓటీటీలలో అనేక సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో లేవు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. ఒకటో రెండో సినిమాలు మెప్పించాయి కానీ అవి కూడా థియేట్రికల్ ఎక్సపీరియన్స్ మిస్సయ్యామనే ఫీల్ అయితే ఇవ్వలేకపోయాయి. దీంతో థియేటర్స్ లో విడుదలైనా ప్లాప్ అవుతాయనే సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. తెలుగులో భారీ అంచనాలతో రిలీజైన కీర్తి సురేష్ 'పెంగ్విన్'.. నాని 'వి'.. అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలు ఆడియన్స్ ని నిరాశపరిచాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'మిస్ ఇండియా' సినిమా కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓటీటీలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేని సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఇదే కోవలో మరికొన్ని ఇలాంటి సినిమాలు వస్తే ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అనేది పక్కనపెట్టి ప్లాప్ సినిమాలకు అడ్డా అనే పరిస్థితు వస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. మరి నవంబర్ నెలలో విడుదల కానున్న సినిమాలైనా డైరెక్ట్ రిలీజులలో మేటిగా నిలుస్తాయేమో చూడాలి.