`గబ్బర్ సింగ్` పంచ్ లు అన్నయ్య కోసం నిజమా?
`ఆచార్య` తర్వాత మెగాస్టార్ క్యూలో ముగ్గురు నలుగురు దర్శకులు ఉన్నారు. వీళ్లలో మెహర్ రమేష్ ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత వీవీ వినాయక్ .. బాబి లాంటి దర్శకులు లైనప్ లో వేచి చూస్తున్నారు. చిరు ఇప్పటికే వీళ్లందరితో స్క్రిప్టులు రెడీ చేయిస్తున్నారు. ఇందులో పలు మలయాళ బ్లాక్ బస్టర్ల రీమేక్ లు ఉన్నాయి.
వేదాళం రీమేక్ ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా.. లూసీఫర్ రీమేక్ ని వినాయక్ తెరకెక్కించనున్నారు. ఆ తరవాత బాబీతోనూ ఓ సినిమా ఉంటుందని కొణిదెల కాంపౌండ్ వెల్లడిస్తోంది. ఇకపోతే వేదాళం కోసం మెహర్ రమేష్ ని ఎంచుకోవడంపై రకరకాల విమర్శలు వచ్చినా చిరు కాన్ఫిడెన్స్ వేరేగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైలాగులు రాస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
గబ్బర్ సింగ్ డైలాగులకు చిరు వీరాభిమాని. ఆ సమయంలో గబ్బర్ సింగ్ సింగిల్ లైన్ డైలాగ్స్ కి పంచ్ లకు ఫిదా అయిపోయానని చిరు ప్రశంసలు కురిపించారు. అందుకే హరీష్ కి డైలాగ్స్ రాసే ఛాన్సిస్తున్నారట చిరు. ఇక పవన్ కల్యాణ్ నోట గబ్బర్ సింగ్ డైలాగులకు థియేటర్స్ విజిల్స్ మోతతో వేడెక్కిపోయాయి. ఇప్పుడు మళ్లీ అన్నయ్య చిరంజీవి కోసం హరీష్ ఆ రేంజు డైలాగులిస్తాడా? అన్నది చూడాలి. ఇక హరీష్ ఎంపికకు సంబంధించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.