క్రియేటర్లు ఇలాంటి షాకిచ్చే స్కీమ్ లు వేస్తున్నారా?
మహమ్మారీ ఇలా కూడా చేస్తోందా..? దర్శకరచయితల్ని కుమ్మక్కయ్యేలా.. క్రియేటర్లందరినీ ఓచోట చేర్చేలా.. ఒకే గొడుగు కింద బెస్ట్ స్క్రిప్టులు మలిచేలా.. మంచి పనులు కూడా చేయిస్తున్నట్టుంది. నిజమే.. మన డైరెక్టర్లు అంతా మైండ్ సెట్ మార్చుకున్నారు. ఈ కష్ట కాలంలో ఒకరికోసం ఒకరు అంటూ పక్క స్క్రిప్టుల్లో వేలు పెడుతున్నారు. అయితే కొలీగ్ కి సాటి దర్శకుడికి అన్నిరకాలా సాయపడేందుకే ఇలా చేస్తున్నారు.
అప్పట్లో మణిరత్నం కోసం ఆర్జీవీ .. ఆర్జీవీ కోసం మణిరత్నం ఒకరి స్క్రిప్టులో ఒకరు సాయపడేవారు. ఇప్పుడు అదే బాటలో మన స్టార్ డైరెక్టర్లు .. నవతరం దర్శకులు కూడా ఓ చెయ్యేస్తున్నారు. అయితే అదేమీ ఉచితం కాదు. దానికోసం భారీగానే పారితోషికాలు గుంజేస్తున్నారన్న సమాచారం ఉంది. స్టార్ డైరెక్టర్లకు అయితే కోట్లలోనే ఈ సైడ్ ఇన్ కం ముడుతోందంటే షాక్ తినకుండా ఉండలేం.
ఇక వీళ్లంతా అంత బిజీలోనూ ఇన్ని పనులు ఎలా చేస్తారు? అంటే.. ప్రతి పెద్ద డైరెక్టర్ తన వద్ద పది మంది రచయితలకు అవకాశం కల్పిస్తున్నారు. నవతరం లో ఔత్సాహికుల్ని .. ప్రతిభావంతులైన వారిని ఘోస్ట్ రైటర్లుగా సద్వినియోగం చేస్తున్నారు. ఫైనల్ చేసేది వీళ్లే కాబట్టి ఓవైపు తాము దర్శకత్వం వహించే సినిమాపై కాన్ సన్ ట్రేట్ చేస్తూనే ఘోస్ట్ లకు ఐడియాలిచ్చి రాయించి వాటిని ఫైనలైజ్ చేసి చివరికి ఏదోలా స్క్రిప్టు డాక్టర్లుగా చేయాల్సింది అంతా చేసి మ్యానేజ్ చేస్తున్నారు. దానికోసం నిర్మాతల నుంచి కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారనేది ఫిలింనగర్ గుసగుస.
ఈ లాక్ డౌన్ పీరియడ్ లో లాభపడిన వారు ఎవరు? అంటే.. చాలామంది దర్శకులకు ఈ విద్య సైడ్ ఇన్ కంలా బాగానే కలిసొచ్చిందని తెలుస్తోంది. రాజమౌళి- సుకుమార్- త్రివిక్రమ్- కొరటాల శివ .. వీళ్లంతా ఇదే కోవలో లాక్ డౌన్ ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. అనీల్ రావిపూడి- వంశీ పైడిపల్లి- నందిని రెడ్డి- దేవ కట్టా- శివ నిర్వాణ- త్రినాథరావు నక్కిన లాంటి డైరెక్టర్లు చాలా వరకూ ఈ కోవలో బాగానే ఆర్జించారని తెలుస్తోంది. సాటి దర్శకరచయితలతో కలిసి పని చేసి బెస్ట్ ఔట్ పుట్ ని తెచ్చేందుకు సాయమయ్యారు వీళ్లంతా. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో టీమ్ వర్క్ లా.. ఈ విద్య బాగానే ఉందండోయ్ అని పొగడాలి మరి.