అరవింద ఆడియోకు ముహూర్తం ఖరారు!

Update: 2018-09-07 06:00 GMT
దసరా సీజన్ దగ్గరకు వస్తోంది... కరెక్ట్ గా చెప్తే ఇక నెల రోజులు మాత్రమే ఉంది.  దీంతో తెలుగు సినిమా ప్రేమికుల దృష్టి అంతా 'అరవింద సమేత' పైనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సారి కలిసి పనిచేయడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు థమన్ సంగీతం అందించడం కూడా ఇదే మొదటిసారి.  దాంతో మ్యూజిక్ లవర్స్ కూడా థమన్ కూడా ఎలాంటి సంగీతం అందించాడో అని వేచి చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'అరవింద సమేత' ఆడియో లాంచ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ 20 వ తారీఖున చేసేందుకు ఫిలిం మేకర్స్ ముహూర్తం ఖరారు చేసి పెట్టారట.  హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్ లో ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ను జరుపుతారట.  ఈ లాంచ్ ఈవెంట్ కు బాబాయ్ నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరావుతాడని ఇప్పటికే  వార్తలు వస్తున్నాయి గానీ ఫిలిం మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఈ సినిమాలో పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి - రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారట.  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాను చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలనే తపనతో చాలా శ్రద్ధగా పనిచేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.  మరి ఎలాంటి ఆడియోతో ఈ డప్పువీరుడు ఆడియన్స్ ముందుకొస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News