ఎనీ టైమ్ థియేటర్..అందరికీ వర్క్ అవుట్ అవుతుందా?

Update: 2020-06-07 14:30 GMT
సినిమా ప్రదర్శన రంగం ఈమధ్యకాలంలో పెను మార్పులకు లోనవుతోంది. కొత్త సినిమాలు చూడాలి అంటే తప్పనిసరిగా థియేటర్లే గతి అనే దశనుంచి అలా ఏం లేదు ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి.  ఓటీటీలో కూడా విడుదల చేసుకోవచ్చు.. ఆన్ లైన్ థియేటర్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు అంటూ కొత్త పద్ధతులు ఇప్పుడే అనుభవంలోకి వస్తున్నాయి.  ఓటీటీ రిలీజుల గురించి అందరికీ అవగాహన వచ్చేసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 'క్లైమాక్స్' పుణ్యమా అని ఆన్లైన్ థియేటర్/ఎనీ టైమ్ థియేటర్ కూడా అందరికీ తెలిసింది.

అయితే అన్నీ సినిమాలకు ఈ ఆప్షన్స్ సూట్ అవుతాయని ఎక్కువమంది ఫిలింమేకర్లు భావించడం లేదు.  ఈ ఎనీ టైం థియేటర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఆప్షన్  చిన్న సినిమాలకు.. సెన్సార్ వారితో ఇబ్బందులు తప్పవు అనుకునే సినిమాలకు మాత్రమే వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయం వెల్లడవుతోంది.  ఎక్కువ బడ్జెట్  సినిమాలు.. మీడియం రెంజ్ బడ్జెట్ తో సినిమాలు తీసి కుంభ స్థలం కొట్టాలని చూసే నిర్మాతలకు వర్క్ అవుట్ కాదు.  ఎందుకంటే ఇందులో సినిమా చూడాలి అంటే ఒకసారి చూసేందుకు వంద రూపాయల టికెట్ ఉంటుంది. ఒకరు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే వంద మంది ఆ ఐడీని వాడే కాలంలో మనం ఉన్నాం. ఆన్ లైన్ థియేటర్ లో వంద రూపాయల టికెట్ తో ఒక్కరే ఆ సినిమాను చూస్తారనే గ్యారెంటీ ఉండదు.  అదే థియేటర్ల విషయం తీసుకుంటే వందరూపాయలతో ఒక్కరే చూడగలరు. వంద మంది చూడాలంటే  వంద టికెట్లు కొనాలి.

అందుకే ఎనీ టైమ్ థియేటర్ ఆప్షన్ మంచిదే కానీ పెద్ద బడ్జెట్లు.. మీడియం రేంజ్ బడ్జెట్లు.. చిన్న సినిమాలు తీసి భారీ కలెక్షన్స్ సాధించాలనుకునే వారికి పెద్దగా వర్క్ అవుట్ కాదు.  సినిమా మీద ప్యాషన్ తో ఉన్నవారు.. తక్కువ బడ్జెట్ తో సినిమా తీసేవారు ఎలాగైనా సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకునేవారికి ఇదో కొత్త ఆప్షన్.

    

Tags:    

Similar News