• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దర్శకుడు అనుష్కను...

ఆ దర్శకుడు అనుష్కను అసభ్యంగా తాకాడట

By - Tupaki Desk
Update: 2016-12-27 09:30 GMT
కరణ్ జోహార్ గత కొన్నేళ్లలో దర్శకుడిగా కంటే ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంతో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. బాలీవుడ్ సెలబ్రెటీల్ని పట్టుకొచ్చి రసవత్తరంగా ఈ ప్రోగ్రాంను నడపడంలో.. వివాదాస్పద ప్రశ్నలేసి.. వారితో సెన్సేషనల్ ఆన్సర్స్ చెప్పించి.. ఈ ప్రోగ్రాంకు మాంచి టీఆర్పీ రేటింగులు తెప్పించడంలో కరణ్ ఆరితేరిపోయాడు. ఈ ప్రోగ్రాం అంతా డ్రామా అని.. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్క్రిప్టు ప్రకారమే ఇందులో వివాదాలు పుడుతుంటాయని విమర్శలు ఉన్నప్పటికీ.. ఈ ప్రోగ్రాం అయితే సూపర్ హిట్టన్నది వాస్తవం. తాజాగా అనుష్క శర్మ-కత్రినా కైఫ్ కాంబినేషన్లో కరణ్ చేసిన ఎపిసోడ్ కూడా జనాల దృష్టిని అలాగే ఆకర్షించింది.

ఈ ఎపిసోడ్లో అనుష్క శర్మ.. కరణ్ జోహార్ మీద సంచలన ఆరోపణలు చేసింది. కరణ్ దర్శకత్వంలో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్ సందర్భంగా అతను తనను అభ్యంతరకర రీతిలో తాకాడని ఆరోపించింది. దీనికి కరణ్ స్పందిస్తూ.. తనకు అనుష్క మీద ప్రేమ పుట్టిందని.. ఆమెకు పడిపోయానని బదులిచ్చాడు. అనంతరం అనుష్క ఇంకొంచెం సీరియస్ అయి.. కరణ్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టాలని కూడా అంది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కత్రినా.. నీలో చురుకుదనం తీసుకురావడానికే కరణ్ అలా చేసి ఉంటాడంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అనుష్క అంతటితో ఆగకుండా ఓ పార్టీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను కూడా అసభ్యంగా తాకాడంటూ కరణ్ మీద ఆరోపణలు చేసింది. దీంతో ప్రోగ్రాం మరింత రసపట్టుకు చేరుకుంది. మరి అనుష్క ఆరోపణలు సరదాకు చేసినవా.. లేక స్క్రిప్టు ప్రకారం చేసినవా అన్నదే తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anushka Sharma 
  • Karan Johar 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS