కలాం పేరు కూడా తెలీదా అనుష్కా..?

Update: 2015-07-28 16:15 GMT
కీలక సందర్భాల్లో స్పందించటం తప్పేం కాదు. కానీ.. తమ స్పందన కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బ తినేలా ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ట్విట్టర్ వేదికగా.. బాలీవడ్ నటుడు ఒకరి తర్వాత ఒకరు తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

మొన్న నేహాధూపియా.. నిన్న సల్మాన్ అయితే.. నేను ఆ జాబితాలో వచ్చి చేరారు అనుష్కశర్మ. వెండితెర మీద బ్రహ్మాండంగా చెలరేగిపోయేఆమె.. ట్విట్టర్ లో ట్వీట్ చేసే విషయంలో మాత్రం తప్పులో కాలేశారు

మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం పేరును తప్పుగా రాస్తూ ట్వీట్ చేశారు. కలాం మృతికి సంతాపం తెలియజేసేందుకు ట్వీట్ చేసిన ఈ భామ వరుసగా రెండుసార్లు ఆయన పేరును తప్పుగా రాయటంతో పలు విమర్శలు చెలరేగాయి. దీంతో.. రెండుసార్లు ట్వీట్ తొలగించి.. ముచ్చటగా మూడోసారి కలాం పేరును కరెక్ట్ గా రాసింది అనుష్క. పేర్లు రాసేటప్పుడు అంత పరాకు అయితే ఎలా? కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే ఎలా..?
Tags:    

Similar News