భాగమతికి కూడా స్వీటీ దెబ్బ

Update: 2017-06-07 09:34 GMT
సైజ్ జీరో సినిమా ప్రభావంతో అనుష్క ఇప్పుడు లావుగా మారిపోయిన సంగతి తెలిసిందే. బాహుబలి ది బిగినింగ్ తర్వాత ఉద్దేశ్యపూర్వకంగానే బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత ఆ లావు తగ్గించుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన ఓం నమో వెంకటేశాయ.. సింగం3 చిత్రాల్లో అనుష్క రూపం ఆకట్టుకోలేదు.

కానీ బాహుబలి ది కంక్లూజన్ లో మాత్రం అనుష్క మెరుపులు బాగానే ఉన్నాయి. బొద్దుగా కనిపించినా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తక్కువ చేయలేదు. అయితే.. రాజమౌళి సృష్టించిన గ్రాఫిక్ మాయాజాలం మహిమ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు భాగమతి విషయంలో కూడా మేకర్స్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అది కూడా అనుష్క సైజ్ వల్లే కావడం గమనించాలి. ఇప్పుడు బాహుబలిలో కనిపించినట్లు కాకుండా.. వేరే విధంగా స్వీటీ కనిపిస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. ఈ చిత్రానికి అనుష్క కోసం భారీగా గ్రాఫిక్స్ ఉపయోగించాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

బాహుబలి2 కారణంగా ఈ మూవీని తమిళ్.. హిందీల్లో కూడా భారీగా విడుదల చేసే వెసులు బాటు ఉండడంతో కొంత బడ్జెట్ ను అనుష్కను సన్నగా చూపించేందుకు వెచ్చించనున్నారు. దీంతో ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని భావించిన ఈ చిత్రం ఇప్పుడు మరికొంత వాయిదా పడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News