అనుష్క ఆ పూజ ఎందుకు చేయించిందబ్బా..
నిన్న స్వీటీ అనుష్క తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫొటో చూసి.. అందరూ ఆమె లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. అర్రే.. అనుష్క భలే సన్నబడిపోయిందే.. మళ్లీ ఆమెలో మునుపటి గ్లామర్ వచ్చేసిందే.. వెనుకున్నతను అనుష్క అన్నయ్య అన్నమాట.. అనుకుంటూ చర్చించుకుంటున్నారు. ఐతే ఈ ఫొటో బ్యాగ్రౌండ్లో ఉన్న ముగ్గును.. దాని వెనుక ఓ పూజారి కూర్చుని ఏదో యాగం జరిపిస్తున్న సంగతి పట్టించుకోవట్లేదు. ఆ ముగ్గు.. ఈ యాగం సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అనుష్క కన్నడ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. కన్నడిగులకు సర్పాలు.. సర్పదోషాలు.. సర్ప పూజల మీద చాలా నమ్మకం. ఏదైనా దోషాలు ఉంటే సర్ప యాగం చేయిస్తుంటారు అక్కడి పెద్దవాళ్లు. ముఖ్యంగా కాల సర్పదోషం ఉండి ఏ పనీ సరిగ్గా జరగని వాళ్లు.. ఎంతకూ పెళ్లి కాని అమ్మాయిలు ఇలాంటి యాగాలు చేయించుకుంటూ ఉంటారు. అనుష్క ఫొటో బ్యాగ్రౌండ్లో కనిపిస్తున్నది సర్పయాగానికి సంబంధించిన వ్యవహారమే. ఆ యాగం కోసమే ఇలా పాము ఆకారంలో ముగ్గు గీసి పూజ చేస్తారు.
మరి అనుష్క అదే పనిగా ఇంటికి వెళ్లి ఈ యాగం కోసమే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిందంటే తన కోసమే ఇదంతా జరిగి ఉండొచ్చేమో. సౌత్ ఇండియాలో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లందరిలో అనుష్కే సీనియర్. ఇప్పటికే ఆమె వయసు 34 ఏళ్లకు చేరుకుంది. తన పెళ్లి గురించి నాలుగైదేళ్లుగా చర్చ నడుస్తోంది. ఈ మధ్య ఆ చర్చ మరీ ఎక్కువైంది. మరి అనుష్క కోరుకుంటే వరులకా తక్కువా. మరి పెళ్లి కోసం యాగం చేసే పరిస్థితి ఎందుకొచ్చిందో..? బహుశా తాను కోరుకున్న లక్షణాలతో మంచి వరుడి కోసం ఈ యాగం చేయించిందేమో!