అఖిల్ మీదికి అనుష్క

Update: 2017-10-21 11:52 GMT
యువి క్రియేషన్స్ బేనర్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ అనుకున్న ప్రకారం పూర్తయి.. మంచి క్రేజ్ తో విడుదలైనవే. కానీ అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘భాగమతి’ విషయంలో మాత్రం అనుకోని విధంగా చాలా ఆలస్యం జరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సిన ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది.

ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించి ఏ విశేషాన్నీ మీడియాతో పంచుకోలేదు చిత్ర బృందం. కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ విషయంలో మాత్రం లీకులు వస్తున్నాయి. ఇంతకుముందు దసరాకు సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. తర్వాత సంక్రాంతి రిలీజ్ అంటూ వార్తొచ్చాయి. తాజా సమచారం ప్రకారం ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారట.

క్రిస్మస్ ముందు వీకెండ్లో అఖిల్ సినిమా ‘హలో’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తేదీకి తమ సినిమా పక్కా అంటూ అఖిల్ సైతం తాజాగా ధ్రువీకరించాడు. ఇదే సమయంలో ‘భాగమతి’ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు యువి క్రియేషన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘హలో’ వల్ల దీనికి సమస్యా.. ‘భాగమతి’ వల్ల ‘హలో’కు సమస్యా అన్నది చూడాలి. ‘అఖిల్’ను సోలోగా రిలీజ్ చేయడం కోసం క్రిస్మస్ వీకెండ్ కు షెడ్యూల్ అయిన ‘ఎంసీఏ’ను ప్రిపోన్ చేయించిన నాగ్.. తన ఫ్రెండ్ అయిన అనుష్క సినిమా విషయంలో అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తాడేమో చూద్దాం.

Tags:    

Similar News