• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోజు వారి విట‌మిన్...

రోజు వారి విట‌మిన్ ఇస్తున్న క్యూటీ

By - Tupaki Desk
Update: 2021-11-24 07:42 GMT
మాలీవుడ్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌ని చాలా మంది భావించారు. కానీ ఆ అంచ‌నాల‌న్ని త‌ప్పు అయ్యాయి. అనూహ్యంగా అనుప‌మ‌ కెరీర్ మ‌లుపు తిరిగింది. `ప్రేమ‌మ్` తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పెద్ద స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. మీడియం రేంజ్ హీరోల‌కే ప‌రిమిత‌మైంది. ఆర‌కంగాను పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో `రౌడీ బోయ్స్`...`కార్తికేయ -2` చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయి. `రౌడీబోయ్స్` త్వ‌ర‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపైనే అమ్మ‌డు ఆశ‌లు పెట్టుకుంది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఈ మ‌ల్లూ బ్యూటీ హెయిర్ స్టైల్ కి ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫిదా అయిన సంగ‌తి తెలిసిందే. `రౌడీబోయ్స్` లో అనుప‌మ రింగుల హెయిర్ స్టైల్లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ కానుంది. ఈ హెయిర్ స్టైల్ ని ఉద్ద‌శిస్తూ విజ‌య్ సూప‌ర్బ్ అనే కామెంట్ కూడా చేసారు. రౌడీబోయ్స్ కోసం అనుప‌మ‌ని కొత్త లుక్ లో లాంచ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హెయిర్ ట్రిమ్ చేసి రింగుల జుత్తు లోనే కొత్త లుక్ ట్రై చేసారు. ఈ లుక్ ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ హెయిర్ మ‌రోసారి హైలైట్ చేస్తూ కొత్త ఫోటో సెష‌న్లో పాల్గొంది. క్రాక్ టాప్ క్యామిసోల్ ర్యాప్ డ్రెస్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

మ‌ల్లూ బ్యూటీ అనుప‌మ‌ మ‌రో హాట్ కామెంట్ కూడా విసిరింది. `ఇదిగో మీ రోజువారి విట‌మిన్ మీ` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటోతో పాటు కామెంట్ వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాలో అనుప‌మ అభిమానులు కామెంట్ల‌తో..ఎమోజీల‌తో ఎటాక్ చేసారు. ఏది ఏమైనా? రౌడీబోయ్స్ కి ఇదో ర‌క‌మైన ప్ర‌చారం అనాలేమో. ప్ర‌స్తుతం ఈ సినిమాకి బ‌జ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గానే సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాజుగారు అనుప‌మ‌ని ప్ర‌చారం ప‌రంగా ఇలా రంగంలోకి దించుతున్నార‌ని తెలుస్తోంది.

2021-22 సీజ‌న్ అనుప‌మ‌కు అన్నిర‌కాలా క‌లిసొస్తున్న‌ట్టే అనిపిస్తోంది. ప్ర‌స్తుతం నిఖిల్ స‌ర‌స‌న జీఏ2 సంస్థ నిర్మిస్తున్న 18 పేజెస్ లో న‌టిస్తోంది. నిఖిల్ కార్తికేయ 2లోను న‌టిస్తోంది. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అలాగే త‌మిళంలో త‌ల్లి పోగ‌తే విడుద‌ల కావాల్సి ఉంది.హెలెన్.. త‌లై న‌గ‌ర‌మ్ 2 అనే చిత్రాల్లోనూ న‌టిస్తోంది.
Tags:    
  • Anupama Parameshwaran 
  • Anupama Parameshwaran movies 
  • Anupama Parameshwaran images 
  • rowdyboys 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS