నవ్వుతో గుండెలు గుల్లచేస్తోందిగా.. ఈ లేతవయ్యారి!

Update: 2021-02-11 13:54 GMT
తెలుగు ఇండస్ట్రీకి పరభాషా అందాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి అందాలలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ కుర్రభామ గురించి తెలుగు యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అఆ' సినిమాతో తెలుగుతెర పై అడుగుపెట్టిన ఈ అమ్మడు 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ అయింది. చక్కని హావభావాలతో.. ఆకట్టుకునే చూపులతో వచ్చిన కొద్దీకాలానికే అందరి మనసులు తనవైపు లాగేసుకుంది. తెలుగులో సినిమా అవకాశాలతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలాగే పెరిగింది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన నటించింది. కానీ ఇంతవరకు స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ పొందలేదు. అలాగని స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ కూడా చేరుకోలేదు. ఫస్ట్ నుండి కూడా అనుపమ స్కిన్ షోకు దూరంగా ఉంటోంది.

అందుకే హీరోల సరసన రొమాంటిక్ సన్నివేశాలలో కనిపించలేదు. అయితే అనుపమ చివరిగా కనిపించిన తెలుగు సినిమా రాక్షసుడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ అయింది. మొదటి నుండి అనుపమ తన సినిమాలకు డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో తెలుగు సినిమాలైతే లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫోటోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ కర్లీ హెయిర్ సుందరి ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు బెడ్ పై పడుకొని అందమైన నవ్వుతో పోజిచ్చింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా అను గ్లామర్ షో కాకుండా నవ్వుతోనే కుర్రకారును తన వలలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఈ వయ్యారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News