• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మల్లూ సినిమాలకు డేట్స్...

మల్లూ సినిమాలకు డేట్స్ దొరకట్లేదట

By - Tupaki Desk
Update: 2018-04-09 04:07 GMT
అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ తో తన ట్యాలెంట్ ను చూపిన ఈ భామకు.. తెలుగులో కూడా ఆ పాత్రను ఆమెతోనే చేయించారు. అంతకంటే ముందు అఆ చిత్రంతో అనుపమను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆమె లాంటి ప్రతిభావంతులు ఇండస్ట్రీకి చాలా అవసరం అని త్రివిక్రమ్ చెప్పిన మాటలు.. అనుపమ కెరీర్ పై బాగానే ప్రభావం చూపించాయి.

తెలుగులో  నాగచైతన్య.. శర్వానంద్ లాంటి హీరోలు వరుసగా ఆమెకు అవకాశాలు కట్టబెట్టేశారు. గతేడాది ప్రారంభంలో శతమానం భవతి అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత.. ఈమె నుంచి ఉన్నది ఒకటే జిందగీ అంటూ ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. ఇప్పుడు తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలను తెచ్చేయనుంది అనుపమ. ఈ వారంలో రిలీజ్ కాబోతోన్న నాని మూవీ కృష్ణార్జున యుద్ధంలో అనుపమ ఒక హీరోయిన్ గా నటించింది. జీవితంలో స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ప్రవర్తించే రోల్ తనది అని చెబుతున్న ఈ భామ.. తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా ప్రేగ్ నగరంలో చిత్రీకరించారని అంటోంది. అంతకు మించి ఈ పాత్ర గురించి మరే డీటైల్ ను చెప్పలేనని అంటోంది అనుపమ.

తేజుతో కరుణాకరన్ తీస్తున్న మూవీ..మరోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న హలో గురూ ప్రేమ కోసమేరా చిత్రంలో కూడా అనుపమే హీరోయిన్. ఇంకా చేయాల్సిన మూవీ లిస్ట్ చాలానే ఉంది. కానీ తెలుగులో వరుసగా నటిస్తున్న ఈ భామ.. తన హోమ్ ఇండస్ట్రీ అయిన మలయాళంలో మాత్రం అడపా దడపా మాత్రమే చేస్తోది. జొమొంటే సువిశేషాంగల్ చిత్రంలో మాత్రమే కనిపించింది. మలయాళం నుంచి ఆఫర్ వచ్చిన ప్రతీసారి.. తెలుగు సినిమాలతో బిజీగా ఉంటున్నానని.. అందుకే మలయాళీ చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయానని అంటోంది అనుపమ.
Tags:    
  • Anupama Parameshwaran 
  • Telugu Movie Offers 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS