#అనూ.. గులాబీ బాల లిఫ్ట్ లో ఆ ఫోజులేల‌!

Update: 2021-02-14 17:30 GMT
అందానికి అందం వేడెక్కించే సొగ‌సు అనూ ఇమ్మాన్యుయేల్ ప్ర‌త్యేక‌త‌. అందుకే కొంత గ్యాప్ వ‌చ్చినా కానీ ఈ అమ్మ‌డు కంబ్యాక్ అవుతున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించిన అజ్ఞాత‌వాసి.. బ‌న్ని స‌ర‌స‌న న‌టించిన `నా పేరు సూర్య` చిత్రాలు డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ క‌నిపించ‌కుండా వెళ్లిపోయింది ఈ బ్యూటీ.

ఇటీవ‌లే బెల్లంకొండ స‌ర‌స‌న అల్లుడు అదుర్స్ చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీలో అనూ అంద‌చందాలు క‌న్నుల పండుగ‌నే త‌ల‌పించాయ‌న్న టాక్ వినిపించింది. దీంతో పాటు అజ‌య్ భూప‌తి మ‌హా స‌ముద్రం చిత్రంలోనూ న‌టిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ లోనూ అనూ ఓ సినిమా కి క‌మిటైంద‌న్న ప్ర‌చారం కూడా ఉంది.

ఇక ఇదే హుషారులో సోష‌ల్ మీడియాల్లోనూ అనూ స్పీడ్ పెంచేసింది. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో ఈ అమ్మ‌డు వేడెక్కిస్తోంది. తాజాగా ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఓ స్పెష‌ల్ థీమ్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. గులాబీలు ప‌ట్టుకుని బాస్ లా లిఫ్ట్ లో అనూ ఇచ్చిన ఫోజులు గుబులు పెంచుతున్నాయి. అనూలోని రెబ‌లిజంతో పాటు స్పైసీ లుక్ ఎలివేట్ అవ్వ‌డంతో యూత్ వాట్సాపుల్లో ఈ ఫోటోల్ని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.


Tags:    

Similar News