• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: సైనికుడి...

ఫోటో స్టోరి: సైనికుడి గర్ల్ ఫ్రెండ్ గ్లామరసం

By - Tupaki Desk
Update: 2018-04-16 05:25 GMT
సరిహద్దుల్లో శత్రువులపై గుళ్ల వర్షం కురిపిస్తూ యుద్ధరంగంలో వీరవిహారం చేసే సైనికుడిని ఒక్క చూపుకే చిత్తయిపోయేలా చేయడమంటే మామూలు విషయమా? అనుక్షణం దేశం గురించే ఆలోచించే ఆర్మీ మేన్ మనసులో వలపు పుట్టించాలంటే మామూలు సాందర్యానికి సాధ్యమా? అందుకే అను ఇమ్మానుయేల్ లాంటి సుందరి తన అందాల ఆరబోతతో గుండెల్లో గిటార్ మోగించడానికి రెడీ అయిపోయింది.

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో హీరోయిన్ గా మళయాళ కుట్టి అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. మొదటి నుంచి యాక్షన్ ను తక్కువ.. గ్లామర్ ను ఎక్కువగా నమ్ముకున్న ఈ భామ ఈ సినిమాలో అందాల ఆరబోత డోస్ కాస్త పెంచినట్టే కనిపిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కావడం అను కెరీర్ పై గట్టి ప్రభావమే చూపింది. అందుకే నాపేరు సూర్య గ్లామర్ కు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంది. పల్చటి గౌనులో వయ్యారంగా గిటార్ పట్టుకుని నుంచుని ఓరచూపు చూస్తూ అను నుంచున్న లేటెస్ట్ స్టిల్ చూస్తే.. ఆడదాని ఓరచూపులు.. జగాన ఓడిపోని వీరుడెవ్వడు పాట గుర్తొస్తే ఎంత మాత్రమూ తప్పుకాదు. కనీకనిపించని తొడల అందాలతో గ్లామర్ ప్రియుల హార్టులను ఒక్కస్టిల్ తో కొల్లగొట్టేసింది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో వస్తున్న నాపేరు సూర్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే యాక్షన్.. డైలాగులు ఏ రేంజిలో ఉండబోతున్నాయో టీజర్ లో చూపించారు. ఇప్పుడు సైనికుడి గర్ల్ ఫ్రెండ్ గ్లామర్ ను పరిచయం చేశారు.
Tags:    
  • Anu Emmanuel 
  • Naa Peru Surya Movie 

Similar News

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...

2026-11-14 06:43 GMT

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

2026-11-14 06:42 GMT

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

2026-11-14 06:33 GMT

దిల్ రాజు పై ఎవరికి అంత కోపం?

2026-11-14 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS