గ్లామర్ డోస్ పెంచేస్తోందిగా..

Update: 2017-02-27 07:44 GMT
చాలా చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయింది మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయెల్. ఒక సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన.. ఆ తర్వాత నివిన్ పౌలీ సరసన కథానాయిక అవతారమెత్తింది. దీంతో ఆ అమ్మాయిని తర్వాత కూడా చిన్న పిల్లలాగే చూడటం మొదలుపెట్టారు. తెలుగులో తన అరంగేట్ర సినిమా ‘మజ్ను’లోనూ అను చిన్నమ్మాయిలాగే కనిపించింది. అందులో ఆమె చాలా పద్ధతిగా కనిపించింది. ఐతే ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో కష్టమనుకుందో ఏమో.. ఉన్నట్లుండి గ్లామర్ డోస్ పెంచేస్తోంది అను.

‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి లిప్ లాక్ లాగించేసి.. తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టిన ఈ డస్కీ బ్యూటీ.. సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించబోతోందని ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలోనూ అమ్మడు రెచ్చిపోతోంది. నిన్న ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్లో అను మతి పోగొట్టేసిందంతే. క్లీవేజ్ అందాలతో ఆ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అను. ఆమె తీరు చూస్తుంటే గ్లామర్ రోల్స్ కు తాను ఎంత మాత్రం అడ్డు చెప్పబోనని సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా ఉంది. ఈ చొరవ చూస్తుంటే తెలుగులో అను మున్ముందు బాగా బిజీ అయిపోయేలా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News