బిబి4 : మరోసారి గందరగోళ టాస్క్
రెండు రోజుల నామినేషన్ పక్రియ తర్వాత నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చాడు. అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ పూర్తిగా ఒక పల్లెగా మారిపోతుంది అంటూ పల్లెలోని పాత్రలను కూడా బిగ్ బాస్ నిర్ణయించాడు. పల్లె పెద్దగా సోహెల్, ఆయన భార్యగా లాస్య. పల్లె పెద్ద కూతురుగా అరియానా. పల్లె పెద్ద బావమరిదిగా పని పాట చేయని వ్యక్తిగా అఖిల్ వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇక పల్లెలో పాన్ డబ్బా పెట్టుకుని బతికే వ్యక్తిగా అవినాష్ అతడి తమ్ముడు మెహబూబ్ రౌడీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పల్లె వారందరికి కూడా వంట చేసి పెట్టే బాధ్యత మోనాల్ మరియు అభిజిత్ లది. మెహబూబ్ ప్రియురాలిగా హారిక ఆమె అందరి పనులకు సాయం చేస్తూ ఆమె పల్లెలోని అబ్బాయిలతో గడుసుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక అమ్మ రాజశేఖర్ ఊరు పెద్ద వద్ద ఉండే పనివాడు. చాలా కష్టపడటంతో పాటు లాస్యను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి.
ఇలా ఇంటి సభ్యులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లను ఇచ్చాడు. వారికి తగ్గ కాస్ట్యూమ్స్ ను ఇచ్చి ఇక చేసేయండి అంటూ టాస్క్ ను ప్రారంభించాడు. టాస్క్ జరుగుతున్నంత సేపు కూడా గ్రామ పెద్ద అయిన సోహెల్ గ్రామంలో ఉన్న మంట ఆరిపోకుండా చూడాల్సి ఉంటుంది. అందుకు కట్టెలు కూడా పంపించారు. అయితే వాటిని మెహబూబ్ తో పాటు మరికొందరు దాచి పెట్టారు. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా టాస్క్ జరుగుతుంది. ప్రేక్షకులు మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనీసం కంటెస్టెంట్స్ అయినా వారు ఏం చేయాలో వారికే తెలియడం లేనట్లుంది.
ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారు అంతా కూడా టాస్క్ ను గందరగోళంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే మొత్తం గజిబిజీగా ఉన్న టాస్క్ నేడు మరెంతగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టనుందో చూడాలి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో విషయం ఏంటీ అంటే అభిజిత్ మరియు మోనాల్ లు కలిసి మాట్లాడుకున్నారు. అఖిల్ నామినేట్ చేయడంపై స్పందించాడు. దాంతో పాటు టాస్క్ లో భాగంగా వారిద్దరికి బిగ్‌బాస్ వంట బాధ్యత అప్పగించారు. నేడు అయినా ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుందేమో చూడాలి.