• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ మూవీలో మరో...

మెగాస్టార్ మూవీలో మరో స్టార్!

By - Tupaki Desk
Update: 2022-04-23 07:30 GMT
చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోలంటే కంటే కూడా ఆయన దూకుడుగా ఉన్నారు. ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించే చిరంజీవి, ఈ మధ్య కాలంలో యంగ్  డైరెక్టర్లతో కలిసి పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

అందువల్లనే వెంకీ కుడుములకి ఆయనతో సినిమా చేసే ఛాన్స్ దొరికింది. 'ఛలో' .. 'భీష్మ' వంటి రెండు సినిమాల హిట్లతోనే ఆయన చిరంజీవితో చేసే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ కథ ఏ జోనర్లో ఉంటుంది? చిరూను ఆయన ఎలా చూపించాలని అనుకుంటున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం.

ఈ సినిమా మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి కాకుండా మరో స్టార్ హీరో ఉండనున్నట్టు చెబుతున్నారు. ఆ  స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవితో బాగా సాన్నిహిత్యం కలిగిన స్టార్ హీరోలుగా రవితేజ - శ్రీకాంత్ కనిపిస్తారు. ఆల్రెడీ చిరంజీవి చేసే మరో సినిమాలో రవితేజ కనిపించనున్నాడు. కనుక ఈ సినిమాలో శ్రీకాంత్ కి ఛాన్స్ దొరకవచ్చనే టాక్ ఉంది. లేదంటే వేరే స్టార్ హీరోలలో ఎవరికైనా ఈ అవకాశం దక్కొచ్చు. ఆ పాత్ర ప్రాధాన్యతను బట్టి ఈ అవకాశం ఉంటుందని అనుకోవాలి.

'ఛలో' సినిమాలో ఒక వైపున అందమైన ప్రేమకథను నడుపుతూనే, మరో వైపున సామాజిక పరమైన సమస్యను చర్చించాడు. అలాగే 'భీష్మ' సినిమాలోను ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ తో పాటు సామాజిక సమస్య .. దానిని హీరో పరిష్కరించే విధానం దిశగానే ఈ కథ నడుస్తుందని అంటున్నారు. కథలో సీరియస్ పాయింట్ ఉన్నప్పటికీ, దానిని తన మార్కు ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా వెంకీ కుడుముల ట్రీట్మెంట్ ఉంటుందట.

చిరంజీవి నుంచి ముందుగా 'ఆచార్య' విడుదలవుతుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఆ తరువాత సినిమాగా ' గాడ్ ఫాదర్' ప్రేక్షకులను పలకరించనుంది. ఇక మెహర్ రమేశ్ తో చేస్తున్న 'భోళా శంకర్' సెట్స్ పై ఉంది.

అలాగే బాబీ దర్శకత్వంలో చేస్తున్న 'వాల్తేరు వీర్రాజు' సినిమా కూడా షూటింగు దశలోనే. ఈ ప్రాజెక్టులు ముగింపు  దశలో ఉండగానే వెంకీ కుడుముల ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Tags:    
  • Tollywood 
  • megastar 
  • chiranjeevi 
  • upcoming 
  • movie 
  • anotherstaractor 
  • raviteja 
  • Srikanth 
  • acharya 
  • tupakinews 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS