మహేష్ తో మరో మూవీ.. స్టార్ హీరోయిన్ కోరిక!
సినిమా ఇండస్ట్రీ అనేది మాయాజాలం లాంటిది. ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఎలాగంటే కొందరు హీరోయిన్స్ అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే స్టార్డం వచ్చేస్తుంది బిజీ అయిపోతారు. మరోరకం హీరోయిన్స్ పరిశ్రమలో ఎన్నేళ్లుగా మూవీస్ చేసినా ఆశించిన సక్సెస్ అందుకోలేరు. మూడోరకం అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ హీరోయిన్స్ మొదట్లో తడబడినా తర్వాత ఊహించని విధంగా బిజీ అయిపోతారు. ప్రస్తుతం అదే ఫీట్ లో ఉంది డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్ కృతిసనన్. ఈ అమ్మడు తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది కానీ తెలుగులో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్డం అందుకొని మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్ అయిపోయింది.
కేవలం బాలీవుడ్ సినిమాలే కాదు. ప్రస్తుతం ఈ టాల్ బ్యూటీ అటు పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పటివరకు జీవితంలో ఎన్నడూ ఊహించని రేంజిలో బిజీ అయిపోయాను అంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. నిజానికి కృతి కటౌట్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తోంది. ఆ సినిమాతో కృతి అన్ని ఇండస్ట్రీలకు సీతగా పరిచయం కాబోతుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన కృతి.. ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ..
"కెరీర్ లో ఎంతో స్పెషల్ అండ్ మోస్ట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను" అంటోంది. అలాగే సూపర్ మహేష్ బాబు గురించి ఒకే వర్డ్ లో చెప్పాలంటే.. 'బెస్ట్! మై ఫస్ట్ ఎవర్ కో-స్టార్! హంబల్ అమేజింగ్..' ఆయనతో మరోసారి వర్క్ చేయాలనీ ఉందంటూ మనసులో కోరిక బయటపెట్టింది. అలాగే కెరీర్ లో సక్సెస్ - ఫెయిల్యూర్స్ పట్టించుకోను అంటోంది. ప్రస్తుతం అమ్మడు ఆదిపురుష్ తో పాటు అక్షయ్ కుమార్ సరసన బచ్చన్ పాండే, భేడియా, గణపత్, మిమీ, హమ్ దో హమారే దో సినిమాలు చేస్తోంది. మొత్తానికి కృతి రెండేళ్లు బిజీ షెడ్యూల్ సిద్ధం చేసి పెట్టుకుంది. చూడాలి మరి సక్సెస్ ఫామ్ కంటిన్యూ చేస్తుందేమో!