మరోసారి 'పుష్ప' ఊర మాస్ ఐటెం చర్చ
అల్లు అర్జున్ పుష్ప సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో బన్నీ లుక్ మాస్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ లుక్ తో పాటు సినిమాలోని ప్రతి ఎలిమెంట్ కూడా ఊర మాస్ లెక్కలో ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక పుష్ప ఐటెం సాంగ్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సాదారణంగానే సుకుమార్ సినిమా అంటే మంచి ఐటెం సాంగ్ ఉంటుంది. పుష్ప సినిమా లో ఈ సారి అంతకు మించి ఊర మాస్ ఐటెం సాంగ్ ఉండబోతుందని అంటున్నారు. రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను దక్కించుకున్న పుష్ప సాంగ్స్ అన్నింటిలోకి ఆ పాట మాస్ ను ఉర్రూతలూగించబోతుంది అంటూ అభిమానులు అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.
ఈ ప్రత్యేకమైన పాట కోసం బాలీవుడ్ నుండి స్టార్ హీరోయిన్ ను దించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా క్రేజ్ ను పెంచేందుకు గాను అక్కడి నుండే భారీ ఖర్చుతో స్టార్ హీరోయిన్ ను దించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ ఫైనల్ కూడా అయ్యిందనే సమాచారం అందుతోంది. పుష్ప సినిమా ను ఆ ఐటెం సాంగ్ షూటింగ్ తో పూర్తి చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సుకుమార్ షూటింగ్ స్పీడ్ పెంచాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కనుక మాస్ ఐటెం సాంగ్ మరింత ఊరమాస్ గా ఉంటుందనే నమ్మకంతో అంతా వెయిట్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా సౌత్ లో అన్ని భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. ఉత్తరాదిన థియేట్రికల్ రిలీజ్ పై అనుమానాలు ఉన్నాయి. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పుష్ప సినిమా చిత్రీకరణ ఈ నెలలో ముగించబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు గాను విదేశాలకు కూడా యూనిట్ సభ్యులు వెళ్లే యోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలుగు కేజీఎఫ్ అంటూ పుష్ప కు టాక్ దక్కింది. రెండు పార్ట్ లుగా రాబోతున్న పుష్ప సినిమా తో బన్నీ స్టార్ డమ్ మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది.