ప‌వ‌న్ క‌ల్యాణ్ - గోపిచంద్ మల్టీస్టార‌ర్ నిజ‌మా?

Update: 2020-11-17 16:10 GMT
పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సంతకాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అవ‌న్నీ ప్రారంభించడానికి వేచి ఉన్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న మలయాళ హిట్ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ ఈ చిత్రాలలో ఒకటి.

ఈ మూవీలో రెండవ హీరోకి స్కోప్ ఉంది. ఈ పాత్రను ఎవరు మొదట పోషిస్తారనే దానిపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. చాలా మంది హీరోల పేర్లు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎవ‌రినీ అధికారికంగా ధృవీకరించలేదు.

సినీవ‌ర్గాల్లో వినిపిస్తున్న తాజా గాసిప్ ఏమిటంటే.. ఈ పాత్రను చేయడానికి స్టార్ హీరో గోపిచంద్ ‌ను సంప్రదించారని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించకపోయినా.. సోషల్ మీడియాలో వైర‌ల్ గానే ప్ర‌చారం సాగుతోంది. గోపిచంద్ ఈ సినిమా చేస్తాడా లేదా అన్న‌ది చూడాలి. అత‌డు ప్ర‌స్తుతం సీటీమార్ అనే యాక్ష‌న్ కామెడీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News