• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కినేని హీరోకు...

అక్కినేని హీరోకు `అన్న‌పూర్ణ` స‌పోర్ట్!

By - Tupaki Desk
Update: 2018-07-06 07:20 GMT
అక్కినేని సుశాంత్ అప్ క‌మింగ్ మూవీ `చి ల సౌ` ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.`అందాల రాక్ష‌సి ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో, ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. స‌ల్మాన్ ఖాన్ అమితంగా ఇష్ట‌ప‌డుతూ...ఆంజ‌నేయ స్వామిని ఆరాధించే ఓ బ్యాచ్ ల‌ర్ పాత్ర‌లో సుశాంత్ న‌టించాడు. ఆ ఇద్ద‌రి లాగే పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ బ్యాచ్ ల‌ర్ గా ఉండిపోవాల‌ని కోరుకునే సుశాంత్.......పెళ్లి చేసుకోక త‌ప్ప‌ద‌ని సుశాంత్ ను ఒత్తిడి చేసే త‌ల్లిదండ్రులు - ఫ్రెండ్స్....ఇలా సాగిపోతోన్న సుశాంత్ లైఫ్ లోకి ఓ ఆమ్మాయి రాక‌తో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ చిత్ర టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. బ్యాచ్ ల‌ర్ పాత్ర‌లో సుశాంత్ - అత‌డి ఫ్రెండ్ పాత్ర‌లో వెన్నెల కిశోర్ ఆక‌ట్టుకున్నారు.

అయితే, తాజాగా  ఈ చిత్రంతో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ చేతులు క‌లిపింది. సిరుని సినీ కార్పొరేష‌న్ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో - ప్రీ రిలీజ్ వేడుక‌ల తేదీల‌ను చిత్ యూనిట్ వెల్ల‌డించ‌నుంది. సుశాంత్ స‌ర‌స‌న రుహానీ శ‌ర్మ న‌టిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహార్ సంగీతం అందిస్తున్నారు. ఎం. సుకుమార్ ..సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆటాడుకుందాం రా....చిత్రం త‌ర్వాత దాదాపు రెండేళ్ల విర‌మం అనంత‌రం `చి ల సౌ`తో సుశాంత్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంతో మంచి హిట్ ను అందుకోవాల‌ని చూస్తున్నాడు. తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్  ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌డంతో మూవీకి మంచి హైప్ వ‌చ్చింది. ఇక త్వ‌ర‌లోనే ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    
  • Annapurna Studios 
  • Sushant 
  • Chilasow Movie 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS