• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ ఫ్యాన్స్ కి దసరా...

రజినీ ఫ్యాన్స్ కి దసరా కానుక.. అదిరిపోయిన 'అన్నాత్తే' టీజర్..!

By - Tupaki Desk
Update: 2021-10-14 14:40 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''అన్నాత్తే'' టీజర్ ని దసరా పండుగ పురస్కరించుకుని ఈరోజు గురువారం విడుదల చేశారు. రజినీ హీరోగా మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న సినిమా 'అన్నాత్తే'. రజనీ మార్క్ డైలాగులు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన టీజర్ అలరిస్తోంది.

రజనీకాంత్ ఒక ఊరు పెద్దగా మధ్య వయస్కుడిగా కనిపిస్తున్నారు. ఈ ఏజ్ లోనూ రజనీ ఎంతో ఉత్సాహంగా రెట్టింపు ఎనర్జీతో చేసిన యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్ అంశాలను మేళవించి దర్శకుడు శివ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సినిమా అంతా తలైవా పంచె కట్టులోనే సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

'అన్నాత్తే' టీజర్ చివర్లో రజినీకాంత్ బైక్ పై కత్తి పట్టుకొని వస్తుండటం.. స్టైల్ గా మీసం తిప్పుకుంటూ నడుస్తుండగా బ్లాస్టింగ్స్ అవడం వంటివి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీనికి డి.ఇమ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ - కెమెరామెన్ వెట్రి పలనిస్వామి అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. విజయదశమి పండుగకు రజినీ ఫ్యాన్స్ కు ఇది అదిరిపోయే గిఫ్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో ఫీమేల్ లీడ్ రోల్స్ కి చోటు కల్పించలేదు.

'అన్నాత్తే' చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో ఏషియన్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో రజినీకాంత్ తో పాటుగా నయనతార - ఖుష్బూ - మీనా - కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతి బాబు - సూరి - అభిమన్యు సింగ్ - సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రూబెన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మిలన్ ఆర్ట్ డైరెక్టర్.

Full View
Tags:    
  • annaatthe 
  • Rajinikanth 
  • Kollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS