త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అనిరుధ్ కామెంట్

Update: 2018-03-05 16:53 GMT
ఈ మధ్య సంగీత ప్రియుల చుట్టూ థమన్ రాగాల గాలి గట్టిగా వీస్తోంది. ఇంతకుముందు ఏ సినిమా చేసినా కాపీ - రిపీట్ మ్యూజిక్ అంటూ ఎదో ఒక నెగిటివ్ టాక్ అందుకునే థమన్ రీసెంట్ గా ట్యూన్ చేసిన ఆల్బమ్స్ అన్నిటికీ మంచి నేమ్ ఏర్పడింది. ముఖ్యంగా తొలిప్రేమ సినిమాకు ట్యూన్స్ ఇచ్చింది థమనేనా అని అందరు అనుకునేలా చేశాడు. మంచి మెలోడీస్ తో తన టేస్ట్ తో ఆకట్టుకున్నాడు. అయితే అదే టేస్ట్ వల్ల ఇప్పుడు థమన్ కి బడా ఆఫర్స్ అందుతున్నాయి.

రీసెంట్ గా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ఎవరు ఉహించని విధంగా సెలెక్ట్ అయ్యాడు. తారక్ సినిమాకు ముందే తన టీమ్ ను సెట్ చేసుకున్న మాటల మాంత్రికుడు సడన్ గా సంగీత దర్శకుడిని మార్చేసిన సంగతి తెలిసిందే. గత వారం కిందట థమన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ముందే త్రివిక్రమ్ అనిరుధ్ తో అంతా మాట్లాడి సెట్ చేసుకున్నాడాట. అనిరుధ్ కూడా చాలా నార్మల్ గా ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ తో లేకుండా ఒకే అనేశాడు. అంతే కాకుండా పాజిటివ్ గా ఓ రిప్లై కూడా ఇచ్చాడు. చిత్ర యూనిట్ కి స్పెషల్ గా విషెస్ ని అందించాడు.

అజ్ఞాతవాసి సినిమాకు వర్క్ చేసిన అనిరుధ్ తారక్ సినిమాకు కూడా మ్యూజిక్ అందించడానికి ఒప్పుకున్నప్పుడు అందరూ హ్యాపీగా ఫిలయ్యారు. కానీ అజ్ఞాతవాసి విడుదల తరువాత అంతా ఒక్కసారిగా అందరి ఆలోచన మారిపోయింది. ఎక్కువగా త్రివిక్రమ్ కు సంగీత దర్శకుడిని మారిస్తే బెటర్ అని సలహాలు అందాయట. దీంతో మార్చక తప్పలేదని టాక్.
Tags:    

Similar News