• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తారక్ సినిమాకు కొలవెరి...

తారక్ సినిమాకు కొలవెరి సంచలనం??

By - Tupaki Desk
Update: 2016-12-10 05:16 GMT
ఎన్టీఆర్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే నిర్మాత కళ్యాణ్ రామ్ నుంచి దర్శకుడు బాబీతో ఎన్టీఆర్ అనే ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలు ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ అని.. కాదు మూడు రోల్స్ చేస్తున్నాడని... ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని.. జనవరిలో షూటింగ్ అని.. ఇలా చాలా అప్డేట్స్ వస్తున్నాయ్ కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ని తీసుకున్నారనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది.

వై దిస్ కొలవెరి అంటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన అనిరుధ్.. ఇప్పుడు టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నట్లే. రీజన్స్ చెప్పకపోయినా.. బ్రూస్ లీ.. అఆ.. మూవీల నుంచి సడెన్ గా తప్పుకుని గతంలో ఇబ్బంది పెట్టాడు. అయితే.. అఆ చిత్రం కోసం త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినా.. మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమాకు అనిరుధ్ రవిచందర్ నే పట్టుకొచ్చాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈ తమిళ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎన్టీఆర్ సినిమా జనవరి చివర్లో మొదలయ్యే ఛాన్సులున్నాయి. పవన్-త్రివిక్రమ్ ల సినిమా కూడా దాదాపు అదే టైమ్ లో మొదలవుతుంది. అంటే.. రెండు తెలుగు సినిమాలకు ఈ అనిరుధ్ ఒకేసారి మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుందన్న మాట. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఒకేసారి మ్యూజిక్ ఇస్తూ.. కొలవెరి కంపోజర్.. టాలీవుడ్ లో బూమ్ లోకి వచ్చేస్తున్నాడు.
Tags:    
  • AniRudh Music 
  • Jr NTR 
  • Bobby Director 
  • Producer Kalyan Ram 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS