• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2023 అనిరుధ్.. అన్ని...

2023 అనిరుధ్.. అన్ని పెద్ద సినిమాలే!

By - Tupaki Desk
Update: 2022-12-30 23:30 GMT
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకులలో అనిరుద్ రవిచందర్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే చాలా బిజీ కంపోజర్ గా మారిపోయిన అనిరుద్ ఇప్పుడు తన సంగీతాన్ని మెల్లగా అన్ని భాషల్లోనూ విస్తరింప చేస్తున్నాడు.

ముఖ్యంగా తెలుగులో కూడా అతనికి ఎప్పటి నుంచో నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ కాస్త ఆలస్యమైతే చేశాడు. ఇక 2023లో అయితే అనిరుద్ చాలా పెద్ద సినిమాలతో సందడి చేయబోతున్నాడు. ఆ లిస్ట్ లోకి వెళితే.. ముందుగా అయితే అజిత్ కుమార్ 62వ సినిమాకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

గత రెండు మూడేళ్ళ నుంచి అజిత్ అనిరుద్ కాంబినేషన్ కు మంచి గుర్తింపు లభిస్తోంది. అలాగే విక్రమ్ సినిమా ద్వారా కమల్ హాసన్ తో వర్క్ చేసిన ఈ యువ సంగీత దర్శకుడు ఇప్పుడు ఇండియన్ 2 సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాకు కూడా అతను మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా 2023 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోతున్న బిగ్ బడ్జెట్ వ్సినిమాలలో జవాన్ కూడా ఒకటి.

ఇక షారుఖాన్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మరోసారి తలపతి విజయ్ 67వ సినిమాకు కూడా అతను వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ ప్రాజెక్టులతో పాటు తెలుగులో కూడా మరోసారి అనిరుద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. అలాగే అనిరుద్ మరికొన్ని సౌత్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • SouthFilmIndustry 
  • AnirudhMusic 
  • AjithKumar62Film 
  • Indian2Film 
  • KamalHassan 
  • Rajinikanth 
  • JailerFilm 
  • ThalapathyVijay67Film 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS