మళ్లీ పవన్ కాటమరాయుడి మ్యాజిక్
టాలీవుడ్ లో కాటమరాయుడు చాలా ట్రెండింగ్ అయింది. ముందుగా ఏ మాత్రం అంచనాలు లేని ఈ మూవీ 100 కోట్ల బిజినెస్ చేసేసింది. ఎక్స్ పెక్టేషన్స్ అందుకోవడంలో విఫలమైనా.. 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి ఫ్లాప్ మూవీగా నిలిచింది.
ఇది పవన్ పవర్ అని సింపుల్ గా చెప్పేయచ్చు. అయితే.. కొన్నేళ్లకు ముందే కాటమరాయుడు అంటూ పవర్ స్టార్ ఓ మ్యాజిక్ చేసేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన అత్తారింటికి దారేది మూవీలో 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా' అంటూ పవన్ స్వయంగా పాడిన ఓ సెన్సేషన్. మళ్లీ ఇలాంటి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారట పవన్.. త్రివిక్రమ్. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీలో కూడా అదిరిపోయే ఫోక్ సాంగ్ ఒకటి సెట్ చేశారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/